LPG Cylinder Price Cut: దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆయిల్ కంపెనీలు తీసుకున్న వల్ల సిలెండర్‌కు ఏకం రూ. 24 రూపాయలు తగ్గాయి. ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రయోజనం చేకూరనుంది. సామాన్యుడి మాత్రం గుదిబండగా ఉంది.
దేశవ్యాప్తంగా జూన్ ఒకటి (ఆదివారం) నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.దీంతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు రూ.24 తగ్గింది. ఒకవిధంగా చెప్పాలంటే చిన్న, పెద్ద హొటళ్లు, రెస్టారెంట్లకు బాగానే రిలీఫ్. ధర తగ్గడం వల్ల వ్యాపారులకు ఊరట.
దీనివల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే వీలు ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా మూడవ నెలలో ధరలు తగ్గుముఖం పట్టాయి. అందుకుముందు మే నెలలో రూ. 14.5 లను కంపెనీలు తగ్గించాయి. ఏప్రిల్ అయితే ఏకంగా రూ. 41 మేరా ధర తగ్గించాయి. సామాన్యుడికి మాత్రం గుదిబండగానే మారనుంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు ఆయిల్ కంపెనీలు.
హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం రూ. 905 లకు ఆయా గ్యాస్ ఏజెన్సీలు విక్రయిస్తున్నాయి. డొమెస్టిక్ 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.335.50 లుకా ఉంది. హైదరాబాద్‌లో 47.5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 4,855 వద్ద విక్రయిస్తున్నారు.
ALSO READ: ఆ కోవిడ్ పేషెంట్‌ని చంపేయ్, వివాదాస్పదంగా డాక్టర్లు సంభాషణ
ధర తగ్గింపుతో ఈ సిలిండర్లపై రూ.63.50 మేరా తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్ ఒకటి నుంచి పరిశీలిస్తే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ మీద 44 రూపాయలు తగ్గిందన్నమాట. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, ఇతర మార్కెట్‌పై ఆయా ధరలు పెంచడం, తగ్గించడం అనేది ఆధారపడి ఉంటుంది.
భారతదేశంలో దాదాపు 90 శాతం LPG ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. దుకాణాలు, రెస్టారెంట్లు, పరిశ్రమలు, వాహనాలలో కేవలం 10 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారు. వాణిజ్య ధరలలో స్వల్ప తగ్గింపు ఆయా వ్యాపారాలకు సహాయపడుతుంది. ఇళ్లలో వంట కోసం ఉపయోగించే సిలిండర్ల ధరలు ఈ ఏడాది మార్చిలో రూ. 50 పెంచింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సుంకాలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. దేశీయ గ్యాస్ ధరలను ప్రపంచ ముడి చమురు మార్కెట్‌తో అనుసంధానిస్తుంది. ఈ ధర భారత మార్కెట్లో సగటు ముడి చమురు ధరలో 10 శాతంగా నిర్ణయించబడింది.
మే 2025లో సగటు ముడి చమురు ధర బ్యారెల్‌కు USD 64.5గా ఉంది. మూడేళ్లలో ఇదే అత్యల్పం ఇదే. చమురు ధరలు బ్యారెల్‌కు 65 డాలర్ల దగ్గర ఉంటే చమురు కంపెనీలు LPG అమ్మకాల నుండి వచ్చే నష్టాలను దాదాపు 45 శాతం తగ్గించు కోవచ్చు. గత పదేళ్లలో దేశంలో LPG వినియోగం వేగంగా పెరిగింది. ఏప్రిల్ ఒకటి నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 33 కోట్ల మంది LPG వినియోగదారులున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.