Manchu Manoj: సాధారణంగా ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఏ రంగంలో అయితే స్థిరపడి ఉంటారో తమ పిల్లలను కూడా అదే రంగంలోకి తీసుకువెళ్లడం కోసం ప్రోత్సహిస్తూ ఉంటారు. అది రాజకీయాలు అయినా, సినిమా అయినా, వైద్య రంగమైనా తమ పిల్లలు కూడా తమలాగే మంచి స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి పిల్లలు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో వచ్చే వారసత్వాన్ని మాత్రం చాలా మంది తప్పు పడుతూ ఉంటారు.
సినీ వారసత్వం..
సినిమా ఇండస్ట్రీలో కొత్తవారికి అవకాశాలు ఉండవని, కేవలం వారి పిల్లలకు మాత్రమే అవకాశాలు కల్పిస్తారని, కొత్త వాళ్లు వెళ్తే ఇండస్ట్రీలో తొక్కేస్తారు అంటూ ఇలా ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఈ నెపోటిజం (Nepotism)గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా మంచు మనోజ్ (Manchu Manoj)కు కూడా నెపోటిజం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. భైరవం(Bhairavam) సినిమా తర్వాత మనోజ్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు అలాగే పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయనకు నెపోటిజం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
నటుడిగా నిరూపించుకోవాలి…
ఈ సందర్భంగా మనోజ్ సమాధానం చెబుతూ… నేను సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలోనే పుట్టాను చిన్నప్పటినుంచి మా నాన్నగారి సినిమాలను చూస్తూ పెరిగాను, అలాగే నేను కూడా బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసి, ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాను. అలాగే 19 సంవత్సరాలకే హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. చిన్నప్పటినుంచి నేను ఈ వాతావరణంలో పెరగటం వల్ల ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది నాకు ప్రతిదీ తెలుసు. అందుకే నేను ఇటువైపే రావడానికి ఇష్టపడతాను. ఇలా సినీ వారసులు ఇండస్ట్రీలోకి రావడం తప్పు కాదని, ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత వారికంటూ గుర్తింపు సంపాదించుకోవటమే కష్టమని తెలిపారు.
నేను మోహన్ బాబు (Mohan Babu)గారి కుమారుడిని కాబట్టి నాకు మొదటి రెండు సినిమా అవకాశాలు చాలా సులభంగా వస్తాయి. ఆ రెండు సినిమాల ద్వారా నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి, అలా నిరూపించుకోకపోతే తప్పు నాదే అవుతుంది.సినీ వారసత్వం అనేది మొదటి రెండు సినిమాల వరకు మాత్రమే పని చేస్తుంది తప్ప, తర్వాత మనమే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాల్సి ఉంటుంది అంటూ మనోజ్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోతున్నారనే విషయం మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే వారసత్వం పనికిరాదని, టాలెంట్ ముఖ్యమని మరోసారి మనోజ్ ఇలా క్లారిటీ ఇచ్చారు. ఇక మనోజ్ 9 సంవత్సరాల తర్వాత భైరవం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.