Hot Water: చలికాలంలో మాత్రమే పరిమితం కాదు. చాలా మంది ప్రతి సీజన్‌లో వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది. రోజులోని అలసట తొలగిపోతుంది కాబట్టి చాలా మంది వేడి నేటి స్నానం దినచర్యలో భాగంగా చేసుకుంటారు. వేడి నీటితో స్నానం చేసిన వెంటనే శరీరంలో అలసట తొలగిపోయిన భావన కలుగుతుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం, జుట్టు, రక్త ప్రసరణపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది సహజ నూనెలను తొలగించడం ద్వారా చర్మాన్ని పొడిగా చేస్తుంది. జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. మీరు రోజూ వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా సరైన జాగ్రత్తలు సకాలంలో తీసుకోవచ్చు.
చర్మం పొడిబారడం, చికాకు:
వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ నూనె పొర తొలగిపోతుంది. ఇది చర్మాన్ని పొడిగా, నిర్జీవంగా చేస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది మరింత హానికరం. రోజూ వేడి నీటితో స్నానం చేస్తే దురద, చికాకు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి.
జుట్టు మూలాలు బలహీనంగా మారుతాయి:
చాలా వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. దీనివల్ల తల చర్మం పొడిగా మారుతుంది.అంతే కాకుండా ఇది చుండ్రు సమస్యను పెంచుతుంది. వేడి నీరు జుట్టు యొక్క మెరుపును తీసివేస్తుంది. ఫలితంగా జుట్టు నిర్జీవంగా కనిపించడం ప్రారంభిస్తుంది.
రక్తపోటులో హెచ్చుతగ్గులు:
వేడినీటి స్నానం చేయడం వల్ల శరీర రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల కొంతమందికి తల తిరుగుతున్నట్లు లేదా అలసటగా అనిపించవచ్చు. అధిక లేదా తక్కువ రక్తపోటు ఉన్న రోగులు చాలా వేడి నీటిలో స్నానం చేయకూడదు ఎందుకంటే ఇది అసాధారణ హృదయ స్పందనకు కారణమవుతుంది.
వృద్ధాప్య ప్రభావాలు:
వేడి నీరు చర్మం యొక్క స్థితిస్థాపకతను దెబ్బతీస్తుంది. దీని వలన ముడతలు, సన్నని గీతలు త్వరగా కనిపిస్తాయి. ప్రతిరోజూ చాలా వేడి నీటితో స్నానం చేసే వారి చర్మంపై వృద్ధాప్య ప్రభావాలను ముందుగానే చూడవచ్చు. ఇది చర్మం యొక్క కాంతి, యవ్వనాన్ని తొలగిస్తుంది.
Also Read: ఉప్పును ఇలా కూడా వాడొచ్చు తెలుసా ?
రోగనిరోధక శక్తి ప్రభావితం కావచ్చు:
చాలా వేడి నీటిలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో జలుబు, అలసిపోవడం లేదా తరచుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది.రోగ నిరోధక శక్తిని తగ్గించడం లో కూడా ఇది కారణం అవుతుంది.