Ar Rahman: కొన్ని విషయాలు వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మ బాబోయ్ దీని వెనక ఇంత పెద్ద కథ ఉందా అని తర్వాత అర్థమవుతుంది. చాలా సినిమాలకు సంబంధించి దర్శకుల ఇన్వాల్వ్మెంట్ ఎంతగా ఉంటుందో అలానే ఆ టీంలో పని చేసే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమా అనేది టీం వర్క్ అని అందరూ చెబుతూ ఉంటారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది అందరూ ఆలోచనలు కలిపి సినిమా మంచిగా వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఒక దర్శకుడు సినిమా చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ల ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంటుంది. అలానే మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
ఆ ఆస్కార్ పాట రెహమాన్ కంపోజ్ చేయలేదు
ఆస్కార్ అవార్డుకు ఎంత ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ గా రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. అయితే దానికంటే ముందు స్లమ్డాగ్ మిలినర్స్ అని సినిమాలో జయహో పాటకి ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అందరూ ఏ ఆర్ రెహమాన్ కు ఆస్కార్ వచ్చింది అని చాలామంది గర్వించారు. మీడియాలో కూడా ఈ పాట బీభత్సమైన వైరల్ గా మారింది. అయితే వాస్తవానికి ఈ పాటను రెహమాన్ కంపోజ్ చేయలేదట. దీని వెనక ఎవరికి తెలియని ఒక కథ ఉంది.
జయహో సాంగ్ ఎవరు కంపోజ్ చేశారంటే..
బాలీవుడ్ లో సుభాష్ గాయ్ అనే ఒక దర్శకుడు ఉన్నాడు. తాను యువరాజు అనే సినిమా చేశారు. ఆ సినిమాకి సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్ ను ఎంచుకున్నారు. అయితే రెహమాన్ ఆ సినిమాకు సంబంధించి ఆన్ టైం కి ట్యూన్స్ ఇచ్చేవాడు కాదు. ఒకసారి రెహమాన్ ఆఫీస్ కొచ్చి దర్శకుడు సుభాష్ గా కూర్చున్నారు. రెహమాన్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆఫీస్ కి రావడానికి కొంత టైం పడుతుంది. అక్కడే ఉన్న సుక్వీర్ సింగ్ కీబోర్డ్ పైన ఏదో ట్యూన్ కంపోజ్ చేస్తున్నారు. అయితే రెహమాన్ ఆ మ్యూజిక్ స్టూడియోకి వచ్చి ఏమైనా చేసావా అని సుక్వీర్ సింగ్ ను అడిగాడు. అడిగితే ట్యూన్ వినిపించాడు.
నా పేరుకు ఉన్న వ్యాల్యూ అది
వెంటనే నేను నీకు మూడు కోట్లు ఇచ్చి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాను నువ్వు సుక్వీర్ సింగ్తో ట్యూన్ చేస్తావా అని దర్శకుడు సుభాష్ అడిగాడు. దీనికి రెహమాన్ సమాధానంగా నువ్వు నాకు వర్క్ డబ్బులు ఇవ్వట్లేదు నా పేరుకు ఇస్తున్నావని సమాధానం చెప్పారు రెహమాన్. చెన్నై వెళ్లిపోయిన తర్వాత పాట పంపిస్తాను అని ఆ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత రెహమాన్ మేనేజర్ సుక్వీర్ సింగ్ 5 లక్షల రూపాయలు చెక్కు పంపించారు. ఎందుకు అని సుక్వీర్ సింగ్ అడిగినప్పుడు మీరు యువరాజ్ సినిమా కోసం ఏదో ట్యూన్ కంపోజ్ చేశారు కదా. ఆ ట్యూన్ రెహమాన్ గారు వేరే వాళ్ళకి ఇచ్చేశారు అందుకోసమే మీకు ఒక ఐదు లక్షల పంపించారంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ సాంగ్ మరేదో కాదు స్లమ్డాగ్ మిలీనేర్స్ లోని జయహో పాట. ఆ పాటకే ఆస్కార్ అవార్డు లభించింది.
Also Read : Ntr : ఎన్టీఆర్ కు కృష్ణకు మధ్య దూరం పెరగడానికి కారణం ఇదే