Manchu Manoj: మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకు సంబంధించి.. మనోజ్ హీరోగా నటించిన భైరవం మూవీ ప్రమోషన్స్ ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. మనోజ్ పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో కుటుంబంలోని గొడవల గురించి స్పందించమంటే.. కొన్ని విషయాలు చెబుతూ మరి కొన్ని విషయాలు దాట వేస్తూ వచ్చారు. అయితే తాజా ఇంటర్వ్యూలో మాత్రం తన కుటుంబ గొడవలకి ఆ ఒక్కడే కారణమంటూ చెప్పి షాక్ ఇచ్చారు. మరి మనోజ్ చెప్పిన ఆ ఒక్కరు ఎవరు? కుటుంబంలో ఉన్న గొడవలన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయనేది ఇప్పుడు చూద్దాం..
ఆ ఒక్కడి వల్లే కుటుంబానికి దూరమయ్యాను..
మంచు మనోజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను శివయ్యా అనే పదాన్ని చాలాసార్లు వాడాను. కానీ ఆ తర్వాత నాకే బాధేసి మూవీ యూనిట్ కి క్షమాపణలు చెబుతున్నాను. ఎందుకంటే ఒక్కడి వల్ల అందులో నటించిన వారికి ఇబ్బంది కలగకూడదని నేను కన్నప్ప మూవీ యూనిట్ కి క్షమాపణలు తెలియజేశా. అలాగే మా ఇంట్లో గొడవలనేవి పెరిగిపోతూనే ఉన్నాయి. మళ్లీ మా ఫ్యామిలీ కలవాలని ప్రతి రోజు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎప్పటికైనా మళ్ళీ కలుస్తాం. ఇక నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మేమందరం కలిసే ఉన్నాం. కానీ మేము కలిసి ఉండటం మా ఇంట్లో ఒకరికి నచ్చలేదు. అలాగే మోహన్ బాబు కళాశాలలో జరిగే మోసాలన్నింటి గురించి చాలామంది లేఖలు రాసారు.కానీ వాటిని నాన్నదాక వెళ్ళనివ్వకుండా కొంతమంది ఆపేశారు. అయితే ఆ విషయం గురించి అడిగితే నీకెందుకన్నారు. ఆ తర్వాత నాపై నా భార్యపై లేనిపోని కేసులు, కళాశాలలో పనిచేసే వారితో పెట్టించారు. అయితే అనవసరమైన గొడవల్లోకి నా భార్యను లాగడంతో నాకు చాలా బాధేసింది. అందుకే బయటికి వచ్చి పోలీస్ స్టేషన్,మీడియా, కోర్టుల వరకు వెళ్లాను. నా కోపం బాధతో వచ్చింది.మా నాన్న కనిపిస్తే కాళ్లు పట్టుకొని ఏడవాలని ఉంది. కానీ అలా పట్టుకుంటే నేను తప్పు చేసిన వాడినవుతాను. నేను తప్పు చేయలేదు. ఒకవేళ నేను అలా చేస్తే నా పిల్లలకు కూడా అదే నేర్పించినట్టు అవుతుంది. నా తండ్రి చెప్పిన నీతి నియమాలనే నేను పాటిస్తున్నా. తప్పు చేయనప్పుడు తలవంచను. మా ఇంట్లో సమస్యలు సృష్టించిన వారు ఇప్పటికైనా తప్పు తెలుసుకోవాలని నేను ఆ దేవున్ని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఇంటి నుండి బయటికు వచ్చాక నా భార్య బొమ్మల కంపెనీ పెట్టింది. ఆ బొమ్మల కంపెనీకి నేను ఆర్ట్ వర్క్ చేస్తూ మధ్య మధ్యలో కొన్ని కథలు రాస్తూ సొంతంగా నా కాళ్లపై నేను బతుకుతున్నాను అంటూ ఇంట్లో ఉన్న గొడవలపై మరోసారి స్పందించారు మంచు మనోజ్. మనోజ్ మాటల్ని బట్టి చూస్తే విష్ణునే ఈ గొడవలన్నీంటికి కారణం అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
తండ్రితో గొడవలపై మనోజ్ స్పందన..నాన్నే నాకు సర్వస్వం
అలాగే తండ్రి మోహన్ బాబుతో ఉన్న గొడవలపై మాట్లాడుతూ.. నాకు మా నాన్నతో ఎటువంటి గొడవ లేదు. అసలు మా నాన్నతో కలిసి కూర్చొని మాట్లాడదామంటే కూడా నన్ను ఆయన దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు. ఎప్పటికైనా ఆయనతో కలవాలని నేను కోరుకుంటున్నాను. మా నాన్న సర్వస్వం.. ఇక కోర్టులు, పోలీస్ స్టేషన్లో, కలెక్టర్ ఆఫీస్లు అంటారా నేను నా అంతక వెళ్లి కంప్లైంట్ ఇవ్వలేదు. కలెక్టర్ ఆఫీస్ లో నాన్న నాపై కంప్లైంట్ ఇచ్చేలా ప్రేరేపించారు. ఆ తర్వాతనే అన్యాయం జరుగుతోందని నాపై నా భార్యపై అన్యాయంగా కంప్లైంట్ చేశారని మాత్రమే వెళ్లాను అంతే తప్ప నాకు మా నాన్నతో ఎటువంటి విభేదాలు లేవు అంటూ మనోజ్ తెలిపారు.