BigTV English

Manchu Manoj : కెరీర్ ను నిలబెట్టుకోవడానికి తండ్రి బాటలో… మంచు మనోజ్ విలన్ వేషాలు వర్కవుట్ అయ్యేనా?

Manchu Manoj : కెరీర్ ను నిలబెట్టుకోవడానికి తండ్రి బాటలో… మంచు మనోజ్ విలన్ వేషాలు వర్కవుట్ అయ్యేనా?

Manchu Manoj : టాలీవుడ్ లో హీరోలుగా కలిసి రాని పలువురు యంగ్ స్టర్స్ విలన్లుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులో మంచు వారసుడు మనోజ్ (Manchu Manoj) కూడా చేరిపోయాడు. ఈ హీరో సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా విలన్ పాత్రలనే ఎంచుకుంటూ ఉండడం గమనార్హం. దీంతో తండ్రి బాటలో నడుస్తూ మంచు మనోజ్ వేస్తున్న విలన్ వేషాలు వర్కౌట్ అవుతాయా అనే చర్చ మొదలైంది ఇండస్ట్రీలో.


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) కొడుకుగా, స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మంచు మనోజ్ (Manchu Manoj). నిజానికి మనోజ్ ‘మేజర్ చంద్రకాంత్’ మూవీతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. కానీ హీరోగా మాత్రం ‘దొంగ దొంగది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఈ హీరో ఖాతాలో సూపర్ హిట్ మాత్రం పడలేదు. రాజు భాయ్, వేదం, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ వంటి సినిమాలు మాత్రమే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే మంచు మనోజ్ ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోలేదు. దీంతో చివరగా ‘ఒక్కడు మిగిలాడు’ మూవీతో థియేటర్లలోకి వచ్చిన మంచు మనోజ్ ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు.

2017 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్న మనోజ్ (Manchu Manoj) రీసెంట్ గా రూట్ మార్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అయితే తన తండ్రి లాగే సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ అవతారం ఎత్తి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. మంచు మోహన్ బాబు ఇదేవిధంగా కెరీర్ మొదట్లో విలన్ గా కెరియర్ ని మొదలు పెట్టి, ఆ పాత్రల ద్వారానే హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన వారసుడు మంచు మనోజ్ చాలా గ్యాప్ ఇచ్చి, కెరీర్ ను నిలబెట్టుకోవడానికి తండ్రి రూట్ ను నమ్ముకుంటున్నట్టుగా కనిపిస్తోంది.


సెకండ్ ఇన్నింగ్స్ లో ఓన్లీ ఆయన విలన్ పాత్రలు చేయడమే ఇలాంటి టాక్ రావడానికి కారణం. ప్రస్తుతం మంచు మనోజ్ (Manchu Manoj) ‘మిరాయ్’ సినిమాతో పాటు ‘భైరవం’ మూవీలో కూడా విలన్ గా నటిస్తున్నాడు. మరి ఈ యంగ్ హీరో సెకండ్ ఇన్నింగ్స్ లో తండ్రి మంచు మోహన్ బాబుని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాడా? ఈ తండ్రికి సెట్ అయిన ఈ విలనిజం ఇప్పుడు కొడుకుకు సెట్ అవుతుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ముందు హీరోగా ఉండి, ఆ తర్వాత విలన్ గా ఎంట్రీ ఇవ్వడం అన్నది తెలుగు ఇండస్ట్రీలో జగ్గు భాయ్ కి మాత్రమే సాధ్యమైంది. మరి ఇప్పుడు మంచు విష్ణు కూడా జగ్గు భాయ్ రూట్లోనే వెళ్లి మళ్లీ కెరీర్లో పీక్స్ చూస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×