BigTV English
Advertisement

Allu Arjun’s Pushpa 2 : నిర్మాతలు మాట తప్పుతున్నారా..? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితేంటి..?

Allu Arjun’s Pushpa 2 : నిర్మాతలు మాట తప్పుతున్నారా..? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితేంటి..?

Allu Arjun’s Pushpa 2 : ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ బిలియన్ డాలర్ల క్వశ్చన్ సర్య్కూలేట్ అవుతుంది. అదేంటంటే… పుష్ప 2 మూవీ నిజంగానే డిసెంబర్ 5కి రిలీజ్ అవుతుందా..? నిజానికి ఈ క్వశ్చన్ ఇప్పుడు రావొద్దు. ఎందుకంటే… ముందుగా రిలీజ్ డేట్ డిసెంబర్ 6న ఉండేది. కానీ, ఓ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి… ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు చాలా కాన్ఫిడెన్స్‌తో అనౌన్స్‌చేశారు. నిర్మాతలు అన్ని సెట్ చేసుకునే రిలీజ్ డేట్ ను ముందుకు జరిపారని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. దీని తర్వాత వాయిదా గురించి వార్తలు కొద్ది రోజుల పాటు రాలేవు. మళ్లీ ఇప్పుడు వాయిదా వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం డిస్ట్రిబ్యూటర్స్‌కి నిర్మాతలు మాట ఇచ్చారట. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కష్టమే అని తెలుస్తుంది. ఆ మాట ఏంటి..? డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్ధాం…


చాలా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. ఈ సారి ఫైనల్ అంటూ డిసెంబర్ 6ని ప్రకటించారు. తర్వాత ఆ తేదీ కాదు… కాస్త ముందే వస్తున్నాం.. అంటూ డిసెంబర్ 5ను రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేశారు. అయినా… పుష్ప 2 వాయిదా రూమర్స్ తగ్గలేదు. దీనికి కారణం సోషల్ మీడియాలోనో, ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనో వచ్చే వార్తలు కాదు. అసలు కారణమేంటంటే…. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.

పుష్ప 2 కు సంబంధించి ఇంకా రెండు పాటల షూట్ చేయాల్సి ఉందట. అందులో శ్రీలీలతో చేయాల్సిన ఐటెం సాంగ్ కూడా ఉందని సమాచారం. కొన్ని రోజుల్లో ఈ ఐటెం సాంగ్ పూర్తి చేసే ఛాన్స్ ఉంది. ఇక మరో సాంగ్ షూట్ చేయాలా..? వద్దా.. అనే డైలమాలో ఉన్నారట టీం. ఎందుకంటే… ఈ పాటను సినిమాలో యాడ్ చేస్తే, ఇప్పటికే ఎక్కువ నిడివితో ఉన్న సినిమా మరింత పెరిగే ఛాన్స్ ఉందట.


ఇప్పటికే రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. ఈ టైంలో షూటింగ్ పెట్టుకోవడమంటే.. టైం, డబ్బులు వేస్ట్ అని అనుకుంటున్నారట. అయితే ఈ సాంగ్ వల్ల సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందట. అందుకే ఎలాగైనా ఈ సాంగ్ షూట్ చేసి, రిలీజ్ అయిన తర్వాత కాకపోయినా, కొన్ని రోజుల తర్వాత అయినా… సినిమాలో పెట్టాలని అనుకుంటున్నారట.

ఇదంతా జరగాలంటే… చాలా టైం పడుతుంది. కానీ, మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు… ఈ నెల 20 తేదీ నాటికి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మూవీ కాపీని ఇస్తామని మాట ఇచ్చారట. కానీ, ఈ రెండు సాంగ్స్ షూట్ చేసి, వచ్చిన రా ఫుటేజ్‌ని ఎడిట్ చేసి, మ్యూజిక్ సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. 20వ తేదీకి ఇంకా 15 రోజులే ఉంది. ఈ సమయంలో నిర్మాతలు మాటిచ్చినట్టు 20న కాపీ లు రావడం కష్టమే. దీంతో ఇప్పటికే వాయిదా భయం పట్టుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×