Manchu Manoj Vs Vishnu : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్ లో కన్నప్ప ఒకటి. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీని కారణం ఈ సినిమా కథ కంటే కూడా ఈ సినిమాలో నటిస్తున్న చాలామంది స్టార్ కాస్ట్ మీద అలానే ఈ సినిమా దర్శకుడు మీద మంచి నమ్మకాలు ఉన్నాయి. వాస్తవానికి మాట్లాడుకుంటే మంచు ఫ్యామిలీ తీసిన సినిమాలు చూడటం జనాలు మానేసి చాలా రోజులైంది. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఫ్యామిలీ సినిమాలు తీస్తున్న కూడా మినిమం కలెక్షన్లు కూడా రావు.
భారీ బడ్జెట్ తో
కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మోహన్ బాబు ఈ సినిమాకి నిర్మాతకు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుని పాత్రలో కనిపించనున్నారు. అలానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రెండు టీజర్లు రిలీజ్ అయ్యాయి. ఒక టీజర్ దానిలో బాగా ట్రోల్ కి గురి అయింది. ఇది మంచు ఫ్యామిలీకి మామూలు విషయమే. ఈ సినిమా మీద కొద్దిపాటి అంచనాలు కూడా ప్రభాస్ నటిస్తుండడంతో పెరిగాయి అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్ర పైన చాలామందికి క్యూరియాసిటీ ఉంది. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
మంచు విష్ణు టార్గెట్
ప్రస్తుతం మంచు మనోజ్ కూడా భైరవం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ కి ఉన్న తరుణంలో ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో మనోజ్ మాట్లాడుతూ శివయ్య అని పిలిస్తే శివుడు రాడు. శివుడు అభిమానుల రూపంలో, ఇటువంటి దర్శకుల రూపంలో వస్తుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇది వినడానికి మామూలుగా ఉన్నా కూడా, కచ్చితంగా మంచు విష్ణు కన్నప్ప సినిమాకి కౌంటర్ అని చెప్పాలి. ఆ సినిమాలో శివయ్య అని విష్ణు అరిచిన డైలాగ్ ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే డైలాగును సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు వాడినందుకు క్షమాపణలు కూడా తెలియజేశాడు. ఇప్పుడు తాజాగా మనోజ్ ఈ డైలాగ్ పై వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.
Also Read : షాకింగ్.. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్.. కారణం ఏంటంటే..?