BigTV English

Hero Srikanth : చిరంజీవి నాకు గంట క్లాస్ పీకాడు.. ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.. కానీ..

Hero Srikanth : చిరంజీవి నాకు గంట క్లాస్ పీకాడు.. ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.. కానీ..

Hero Srikanth : టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు హీరో శ్రీకాంత్.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో పలు పాత్రలో నటించి మెప్పించాడు.  ఆ తర్వాత హీరోగా మారారు. ఆయన నటనతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. శ్రీకాంత్ నటించిన ప్రతి సినిమా కూడా అవార్డు విన్నింగ్ స్థాయిలో ఉండడం విశేషం. అయితే ఈ మధ్య సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక అలాగే పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటున్నారు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని నమ్మలేని నిజాలను బయటపెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు శ్రీకాంత్, చిరంజీవి మధ్య ఏం జరిగింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..


హీరో శ్రీకాంత్ సినిమాలు..

టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఫ్యామిలీ కదా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటివరకు 125 సినిమాల్లో నటించాడు. విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తెలుగు సినిమా నటుల సంఘం మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) లో శ్రీకాంత్ సభ్యుడిగా పని చేశాడు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు.. ప్రస్తుతం ఈయన పెద్ద కొడుకు రోషన్ హీరోగా చేస్తున్నాడు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా. ఈ సినిమాకు ఐదువేల రూపాయల పారితోషికం అందుకున్నాడు. తాజ్ మహల్ సినిమా ఆయన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికీ ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమాల్లో హీరోల్లో నటిస్తున్నాడు..


Also Read : మా చెల్లెమ్మ జోలికి వస్తే బాగోదు.. మీమర్స్ పై రెచ్చిపోయిన సుమక్క..

శ్రీకాంత్ కు గంట క్లాస్ పీకిన చిరు…

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎప్పుడు హిట్ సినిమాలు పడతాయని చెప్పడం కష్టమే. ఒకసారి హిట్ సినిమా పడితే ఆ తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవడం.. లేదా రెండు ఫ్లాపుల తర్వాత వరుస హిట్ సినిమాలు తన ఖాతాలో పడడం కామన్. అయితే శ్రీకాంత్ విషయంలో కూడా అదే జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బయటపెట్టారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఓ ప్లాప్ సినిమా పడటంతో ఇక హిట్ సినిమా పడదు అని ఫిక్స్ అయిపోయి ఇండస్ట్రీని వదిలేద్దామని అనుకున్నాను. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అన్నయ్య నన్ను తన రూమ్ కి పిలిచి క్లాస్ పీకాడు. గంటసేపు సినిమా పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆయన జీవితంలో సినిమాల విషయంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి అన్న విషయాల గురించి వివరించాడు. హిట్ ప్లాపులు అనేవి మన చేతుల్లో ఉండవు అంతా దేవుడి చేతుల్లోనే ఉంటాయి. దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్లడమే అని ఒక్క మాట చెప్పడంతో ఆ తర్వాత నేను ఇండస్ట్రీలో ఎలా సక్సెస్ అవ్వాలి అని తెలుసుకున్నాను అంటూ చిరంజీవి గురించి శ్రీకాంత్ గొప్పగా చెప్పాడు. ఆ వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజం చెప్పాలంటే చిరంజీవి లాగా కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఆయన ఇలా నటులకు తనదైన స్టైల్ లో మోటివేట్ చేస్తూ ఉంటారు. చిరంజీవి కొడుకు సినిమాల్లో వరస సినిమాలు చేస్తూ ఉన్నా కూడా, చిరంజీవి మాత్రం సినిమాలకు విరామం ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ కుర్ర హీరోలను టెన్షన్ పెట్టేస్తున్నాడు..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×