Heroine Aditi Shankar.. దర్శకుడు శంకర్ (Director Shankar) తన సినిమాల్లో ఎక్కువగా సమాజంలో ఉన్న సమకాలీన సమస్యల గురించి చూపిస్తూ ఉంటారు.అలా ఈయన డైరెక్షన్లో జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు,అపరిచితుడు, శివాజీ,రోబో, ప్రేమికుడు వంటి ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో శంకర్ డైరెక్షన్ లో పట్టు తప్పారని, మునుపటి మ్యాజిక్ మిస్ అవుతోందని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల వచ్చిన గేమ్ ఛేంజర్, భారతీయుడు-2 సినిమాలు శంకర్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. దాంతో శంకర్ మళ్లీ సినిమాల్లో తన మ్యాజిక్ చూపెట్టకపోతే హీరోలు ఈయనను పట్టించుకోరనే టాక్ కూడా వినిపిస్తోంది.
తండ్రి డైరెక్షన్లో అదితి సినిమా చేయకపోవడానికి కారణం..?
ఈ విషయం పక్కన పెడితే.. చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారి వారసత్వం సినిమాల్లోకి వస్తూ ఉంటుంది. అలా శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) కూడా సినిమాల్లోకి వచ్చింది.. కార్తి హీరోగా నటించిన ‘విరుమాన్’ మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అదితి శంకర్ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే స్టార్ దర్శకుడు శంకర్ కూతురు అదితి తన తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా ఎందుకు చేయలేదనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మరి తన తండ్రి డైరెక్షన్లో అదితి ఫస్ట్ ఫిల్మ్ ఎందుకు చేయలేదు అనేది ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మరి వెల్లడించింది. మంచు మనోజ్ (Manchu Manoj),బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్ (Nara Rohit) ముగ్గురు కలిసి నటించిన తాజా మూవీ భైరవం(Bhairavam). అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితి శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు ఇదే ప్రశ్న ఎదురయింది. నీ (తండ్రి డైరెక్షన్లో మొదటి సినిమా ఎందుకు చేయలేదు?)
తెలివైన సమాధానం చెప్పి ఆశ్చర్యపరిచిన అదితి శంకర్..
అయితే ఆ ప్రశ్నకి అదితి శంకర్ ఆన్సర్ ఇస్తూ.. “నేను నా తండ్రి దర్శకత్వంలో ఫస్ట్ సినిమా చేయకపోవడానికి కారణం ఆయన పేరు వాడుకోకుండా గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే నా తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా చేయలేదు. నాకు నటిగా మంచి గుర్తింపు వచ్చాక నన్ను మా నాన్న గుర్తించి, తన సినిమాలో తీసుకోవాలి. ఈ ఒక్క కారణంతోనే నేను నా తండ్రి డైరెక్షన్లో ఫస్ట్ ఫిల్మ్ చేయలేదు” అంటూ అదితి శంకర్ చెప్పుకొచ్చింది. అలాగే చిన్నప్పటినుండి తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తూ హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానని, అందుకే డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా మారాను అంటూ అదితి శంకర్ చెప్పుకొచ్చింది. ఇక అదితి శంకర్ హీరోయిన్ మాత్రమే కాదు సింగర్, డాన్సర్ అలాగే వైద్య రంగంలో కూడా రాణిస్తోంది. మొత్తానికి అయితే తన తండ్రి డైరెక్షన్లో ఎందుకు నటించలేదు అనే విషయాన్ని చెప్పి అందరి ప్రశ్నలకు సమాధానాన్ని తెలిపింది అదితి శంకర్. ఇకపోతే మంచు మనోజ్ నటిస్తున్న ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .ఈ సినిమాకు పోటీగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘కింగ్డమ్’ సినిమా రాబోతుందంటూ వార్తలు వచ్చినా.. ఈరోజు సినిమా విడుదల తేదీని జూన్ 4 కి వాయిదా వేశారు. ఇక సింగిల్ గానే భైరవం మూవీ థియేటర్లలోకి రాబోతోంది అని సమాచారం.
ALSO READ:Sonia Singh: 2 నెలల్లోనే 2 లగ్జరీ కార్లు… సోనియమ్మ… నీకు ఇంత డబ్బు ఎక్కడిది?