Manchu Mohan Babu : మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదం రోజురోజుకీ మరింతగా ముదురుతోంది. తండ్రి, కొడుకుల పరస్పర కంప్లైంట్స్ తో మంచు ఫ్యామిలీలో రచ్చ ఇంకా కంటిన్యూ అవుతోంది. మోహన్ బాబు (Manchu Mohan Babu) తన ఆస్తులను కాజేసేందుకు మంచు మనోజ్ (Manchu Manoj), మౌనిక కుట్ర చేస్తున్నారని, తనకు ప్రాణాన్ని ఉందంటూ రాచకొండ పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తండ్రి కొడుకుల మధ్య జరిగిన వాగ్వాదంలో మంచు మనోజ్ కాళ్లకు, మెడకు గాయాలు ఇవ్వడంతో బంజారాహిల్స్ లోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం పహడి షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే మంచు విష్ణు ఎంట్రీ ఇవ్వడం, మోహన్ బాబు స్పందించడం జరిగాయి.
అయితే తన ఇంటి దగ్గర జరిగిన హైడ్రామా నేపథ్యంలో “పిల్లల ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నా భార్య పిల్లలకు రక్షణ లేకుండా పోయింది. అందుకే బాన్సర్లను తెచ్చుకున్నాను” అని మంచు మనోజ్ (Manchu Manoj) వెల్లడించారు. అంతేకాకుండా తన పరువు తీసి, గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, అసలేం జరుగుతుందో ఆరా తీయాలంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే “ప్రొటెక్షన్ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం అందరినీ కలుస్తాను. నేను ఆస్తి కోసం కాదు ఆత్మగౌరం కోసం పోరాటం చేస్తున్నాను” అంటూ మంచు మనోజ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే దుబాయ్ నుంచి మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా హైదరాబాద్ వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో మోహన్ బాబు స్వయంగా విష్ణుని రిసీవ్ చేసుకోగా, ఇద్దరూ ఓకే కార్ లో జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు స్పందిస్తూ…” ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే. ఇళ్లలో ఇలాంటి గొడవలు జరిగితే అంతర్గతంగానే పరిష్కరిస్తారు. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది. మేమే పరిష్కరించుకుంటాము. గతంలో ఎన్నో కుటుంబ సమస్యలను పరిష్కరించాను. వాళ్లు కలిసేలా చేశాను” అంటూ మోహన్ బాబు ఇచ్చిన ట్విస్ట్ షాకింగ్.
ఎందుకంటే ఇదే మోహన్ బాబు (Manchu Mohan Babu) స్వయంగా తన కొడుకు మంచు మనోజ్ పై ప్రాణహాని ఉందంటూ కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు మంచు విష్ణు హైదరాబాద్లో దిగగానే, “మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాము” అంటూ ప్లేటు తిప్పేయడం ఏంటో మరి. పైగా మోహన్ బాబు ఇంటికి పహాడి షరీఫ్ పోలీసులు చేరుకున్న తరుణంలో ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. మనోజ్ పహాడి షరీఫ్ లో తనపై పది మంది వ్యక్తులు దాడి చేశారని విజయ్, కిరణ్, సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లారని కంప్లైంట్ చేస్తూ… తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
ఇదిలా ఉండగా… జల్పల్లి లోని మోహన్ బాబు ఇంటి దగ్గర సన్నిహితుల సమక్షంలో మంచు మనోజ్ (Manchu Manoj), మోహన్ బాబు (Manchu Mohan Babu), విష్ణు (Manchu Vishnu) మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి సోమవారం రోజు పెద్ద మనుషుల సమక్షంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం జరిగింది. కానీ సోమవారం చర్చలు ఫలించకపోవడంతో ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. మరి తాజాగా మంచు విష్ణు ఎంట్రీ తో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.