Manchu Vishnu: మంచు విష్ణు (Manchu Vishnu)ఇటీవల కాలంలో తరచూ వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల తన కుటుంబంలో చోటు చేసుకున్న గొడవల కారణంగా మంచు విష్ణు తరచు పోలీస్ స్టేషనులకు వెళ్లి వస్తున్నారు. తాజాగా ఈయన ఏకంగా సుప్రీంకోర్టు(Supreme Court) మెట్ల ఎక్కారని తెలుస్తోంది. మంచు విష్ణు పై 2019 వ సంవత్సరంలో ఒక కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల(2019 Elections) సమయంలో మంచు విష్ణు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఈయన ఎన్నికల కోడ్ ఉల్లంఘిచడంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసు అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసు విషయంలోనే మంచు విష్ణు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇకపోతే ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడటం కోసమే మంచు విష్ణు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.
కన్నప్ప సినిమా ప్రమోషన్స్…
మంచు విష్ణు ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే ఈయన కుటుంబ గొడవల కారణంగా కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్ తో బేదాభిప్రాయాలు రావడంతో తరచూ గొడవలు పడుతున్న విషయం తెలిసుందే. ఈ అన్నదమ్ములు రోడ్లపై ఒకరినొకరు కొట్టుకోవడం, పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మనోజ్ లేని సమయంలో విష్ణు తన అనుచరులతో కలిసి మనోజ్ ఇంట్లోకి వెళ్లి వస్తువులన్నింటిని ధ్వంసం చేశారని మనోజ్ ఆరోపణలు చేయడమే కాకుండా మోహన్ బాబు ఇంటి ముందు కూర్చొని దీక్ష కూడా చేశారు. ఇక ఈ అన్నదమ్ముల మధ్య గొడవకు ఆస్తి కారణమని వార్తలు బయటకు వచ్చాయి కానీ మనోజ్ మాత్రం ఆస్తుల కోసం నేను గొడవ పడాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. నా గొడవ మొత్తం యూనివర్సిటీ కోసమేనని మనోజ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ విష్ణు మాత్రం ఈ గొడవల గురించి ఎక్కడ స్పందించలేదు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన…
ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక వైపు గొడవలు జరుగుతూనే ఉన్నా మరోవైపు వీరు నటించిన సినిమా పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ కనిపించలేదనే వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా కన్నప్ప మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది.ఇలాంటి తరుణంలోనే మంచు విష్ణు 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో తనపై నమోదు అయిన కేసు నుంచి బయటపడటం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో మరోసారి వార్తలలో నిలిచారు.