Kannappa: మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. భారీ అంచనాల మధ్య అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిందీలో ‘రామాయణం’ సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ సింగ్(Mukhesh Singh) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్ లాల్ (Mohan Lal), మోహన్ బాబు (Mohan Babu), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), అక్షయ్ కుమార్(Akshay Kumar) , ప్రభాస్ (Prabhas) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నిన్న అనగా మార్చి 29వ తేదీన మంచు విష్ణు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అందరికీ క్షమాపణలు చెబుతూ విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం అంటూ ప్రకటించారు.
విడుదల తేదీ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్..
ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన కన్నప్ప సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నాము. ముఖ్యంగా అభిమానుల అంచనాలకు మించి, అద్భుతమైన సినిమాతో మీ ముందుకు రావడానికి కాస్త సమయం పడుతుంది. దయచేసి ఓపిక పట్టండి. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో మీ ముందుకు వస్తాము. ఈ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగానే సినిమా విడుదల తేదీ వాయిదా పడుతోంది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాము”అంటూ ఒక సుదీర్ఘ నోటు పంచుకున్న విషయం తెలిసిందే.ఇకపోతే సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురు చూసిన మంచు విష్ణు అభిమానులకు ఈ మాట నిరాశ మిగిల్చింది అని చెప్పవచ్చు.
పిల్లల నటన గురించి చెబుతూ పొంగిపోయిన మంచు విష్ణు..
ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. తన కొడుకు అవ్రామ్ నటన గురించి అలాగే సినిమా విడుదల తేదీ గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా కొడుకు అవ్రామ్ గురించి మాట్లాడుతూ..”అవ్రామ్ కి రెండు సంవత్సరాల అనుకుంటాను. అప్పుడు ఒక్కసారి నేను టీవీలో కనిపించడంతో వచ్చీ రాని మాటలతో నాన్న టీవీ అని చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏంటి నాన్న అని అంటే.. నేను నాన్న లాగా అవుతాను అని అన్నాడు. ఇక ఆ విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని వాడికి నాలుగు సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత కన్నప్ప సినిమాలో తిన్నడు చిన్నప్పటి క్యారెక్టర్ కోసం అవ్రామ్ ను తీసుకోవాలనుకున్నాము.అప్పుడు నేను అవ్రామ్ ను అడిగాను. ఈ సినిమాలో నటిస్తావా అని.. అవును అని చెప్పాడు. ఇక రెండు నెలల పాటు అవ్రామ్ కు నటనలో శిక్షణ ఇప్పించి మరీ సినిమాలోకి తీసుకున్నాము. ఎంత గొప్ప వారికైనా సరే శిక్షణ అవసరం. గురువు లేని విద్య వ్యర్థం. అందుకే అవ్రామ్ కి మొదట రెండు నెలలు శిక్షణ ఇప్పించి, ఆ తర్వాత సినిమాలోకి తీసుకున్నాము.ప్రస్తుతం బాబు వయసు 6 సంవత్సరాలు. అటు అరియాణా , వివియానా కూడా మంచి ట్రెయిన్డ్ సింగర్స్. అరియానా సింగర్ అవ్వాలనుకుంటోంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తోంది అంటూ పిల్లల సినీ ఎంట్రీ పై కామెంట్లు చేస్తూ పిల్లల నటన గురించి మాట్లాడుతూ ఉబ్బితబ్బిబ్బయిపోయారు.
రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు..
ఇక అలాగే సినిమా విడుదల తేదీ గురించి మాట్లాడుతూ.. మీరు పిల్లల నటన గురించి చూడాలి అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. 30న సినిమా వస్తోంది కాబట్టి అప్పుడు చూడండి అంటూ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఇకపోతే అధికారికంగా త్వరలోనే పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటిస్తారేమో చూడాలి.
.