Manchu Vishnu Pressmeet.. జల్పల్లిలో ఉన్న మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఇంటివద్ద నిన్న సాయంత్రం జరిగిన సంఘర్షణలో మోహన్ బాబు స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు మంచు విష్ణు(Manchu Vishnu). ఇక ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్ వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. మంచు మనోజ్ (Manchu Manoj)కి డెడ్ లైన్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్ ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని సాక్ష్యాలతో సహా బయటకు వస్తాను అంటూ తెలిపారు.
మంచు మనోజ్ కి డెడ్ లైన్ పెట్టిన విష్ణు..
ఇకపోతే తాజాగా కాంటినెంటల్ హాస్పిటల్ ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ఈరోజు సాయంత్రం 5:30 గంటల వరకు సమయం ఇస్తున్నాను. కుటుంబ గొడవల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిపోవాలి అంటూ భూమా మౌనిక (Bhuma Mounika)ను కూడా టార్గెట్ చేస్తూ మంచు విష్ణు కామెంట్లు చేస్తున్నట్లు అనిపించింది. ఇకపోతే మంచు మోహన్ బాబు నిన్న విడుదల చేసిన ఆడియోలో మంచు మనోజ్.. భార్య మౌనిక చెప్పుడు మాటలు విని చెడిపోయాడు అని డైరెక్ట్ గా మోహన్ బాబు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే గొడవల్లో మౌనిక హస్తం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు ఈమెను టార్గెట్ చేస్తూ.. ఆ డెడ్లైన్ విధించాడా? అనే కోణంలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి విష్ణు పెట్టిన డెడ్లైన్ కి అటు మనోజ్, ఇటు మౌనిక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.