Zaheer Khan spin : టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా జహీర్ ఖాన్ బౌలింగ్ చేశాడంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టేది. 2003 వరల్డ్ కప్ లో కీలకంగా బౌలింగ్ చేశాడు జహీర్ ఖాన్. జహీర్, ఆశీష్ నెహ్ర, అజిత్ అగర్కార్ వంటి స్టార్ ఫాస్ట్ బౌలర్లతో పాటు హర్భజన్ వంటి స్పిన్నర్లు కూడా తోడవ్వడంతో టీమిండియా 2003లో సౌరబ్ గంగూలీ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కి చేరుకుంది. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయితే ఫాస్ట్ బౌలింగ్ తో బ్యాటర్లకు దడ పుట్టించిన జహీర్ ఖాన్.. ఒకసారి తన స్పిన్ మాయాజాలం కూడా ప్రదర్శించాడు. 2002లో వెస్టిండిస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, సైతం బౌలింగ్ చేసి అదరగొట్టారు. వారు ఆ మ్యాచ్ లో తమ ఫస్ట్ వికెట్ తీశారు. నాటి అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : WTC 2025-27: టీమిండియా ఆడే మ్యాచులు ఇవే.. కోహ్లీ, రోహిత్ లేకుండా కష్టమే ?
కేవలం జహీర్ ఖాన్ మాత్రమే కాదు.. 2002లో యాంటిగ్వాలో వెస్టిండీస్ మారథాన్ ఇన్నింగ్స్‌లో 11 మంది భారత ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. పేసర్లు జహీర్ ఖాన్ మరియు సౌరవ్ గంగూలీ ఆ మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ చేశారు. టెస్ట్ క్రికెట్‌లో సునీల్ గవాస్కర్ ఐదుసార్లు టీమ్ ఇండియా తరపున బౌలింగ్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కపిల్ దేవ్ అరంగేట్రం చేసే వరకు టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందలేదు. కొన్నిసార్లు గవాస్కర్ తన బౌలింగ్ నైపుణ్యాలతో కొత్త బంతి నుంచి మెరుపును తీసే పనిని చేశాడు. 21వ శతాబ్దం ప్రారంభం నాటికి, భారతదేశం ఇలాంటి బౌలింగ్ దాడులతో అత్యుత్తమ బౌలింగ్ దాడులలో ఒకటిగా ఉండేదిజహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, జవగళ్ శ్రీనాథ్ మరియు వారి ర్యాంకుల్లో చాలా మంది ఉన్నారు. భారత్ నుంచి వీ.వీ.ఎస్.లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, వసీం జాఫర్ బౌలింగ్ చేశాడు. అప్పట్లో కెప్టెన్ గంగూలీ కూడా స్పిన్ బౌలింగ్ చేయడం విశేషం.
11 ఆటగాళ్లు బౌలింగ్..
2002లో వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాలోని 11 మంది ఆటగాళ్లు అంటిగ్వా ఫ్లాట్ ట్రాక్ పై బౌలింగ్ చేయడం విశేషం. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి భారత్ 196 ఓవర్లలో 513 పరుగులు చేసింది. 9 వికెట్లు కోల్పోయింది. భారీ స్కోర్ చేయడంతో టీమిండియా నుంచి అందరూ ఆటగాళ్లు బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత మంది నెటిజన్లు అస్సలు జహీర్ ఖాన్ ఫాస్ట్ బౌలర్ కదా.. స్పిన్ బౌలింగ్ చేయడం ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడం విశేషం.