NEET UG Result 2025| వైద్య ప్రవేశ పరీక్ష.. నీట్ యూజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్‌గ్రాడ్యుయేట్) 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA-ఎన్‌టీఏ) ప్రకటించింది. వైద్య ప్రవేశ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో లాగిన్ వివరాలను నమోదు చేసి తెలుసుకోవచ్చు.
ఈ సంవత్సరం నీట్ యూజీ 2025 పరీక్ష కోసం.. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు అధికారిక సమాచారం తెలిపింది. ఫలితాలతో పాటు, ఎన్‌టీఏ టాపర్ల జాబితా, అర్హత కటాఫ్ మార్కులను కూడా విడుదల చేస్తుంది. అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం పొందుతారు. అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన వారు తాము కోరుకున్న కళాశాల, కోర్సులో ప్రవేశం పొందవచ్చు.
నీట్ యూజీ 2025 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను చూసేందుకు ఆన్ లైన్‌లో ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
- అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inని ఓపెన్ చేయండి
- హోమ్‌పేజీలో ఉన్న నీట్ యూజీ 2025 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
- నీట్ యూజీ 2025 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- స్కోర్‌కార్డ్ PDFని చూసి, డౌన్‌లోడ్ చేసుకోండి.
నీట్ ఫలితాల వివరాలు
నీట్ యూజీ 2025 ఫలితాల రికార్డు వెబ్ సైట్ లో.. ప్రకటన తేదీ నుంచి 90 రోజుల వరకు మాత్రమే ఉంచబడుతుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
వర్గాల వారీగా నీట్ అర్హత మార్కులు:
- జనరల్: 720-164 (50వ పర్సంటేజ్)
- జనరల్-పీహెచ్: 163-129 (45వ పర్సంటేజ్)
- ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ: 163-129 (40వ పర్సంటేజ్)
- ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ-పీహెచ్: 145-129 (40వ పర్సంటేజ్)
నీట్ ఫలితాల 2025 అధికారిక వెబ్‌సైట్లు
ఫలితాలను తనిఖీ చేయడానికి అభ్యర్థులు ఈ వెబ్‌సైట్లను సందర్శించవచ్చు:
- neet.nta.nic.in
- nta.ac.in
- డైరెక్ట్ లింక్: https://examinationservices.nic.in/resultservices/Neet2025/Login
నీట్ యూజీ 2025 టాప్ 10 ర్యాంకర్ల జాబితా:
- మహేష్ కుమార్ (రోల్ నంబర్: 3923210013) – జనరల్, 99.9999547 పర్సంటేజ్, ర్యాంక్ 1, రాజస్థాన్
- ఉత్కర్ష్ అవధియా (రోల్ నంబర్: 3003211526) – జనరల్, 99.9999095 పర్సంటేజ్, ర్యాంక్ 2, మధ్యప్రదేశ్
- క్రిషాంగ్ జోషి (రోల్ నంబర్: 3115101159) – జనరల్, 99.9998189 పర్సంటేజ్, ర్యాంక్ 3, మహారాష్ట్ర
- మృణాళ్ కిషోర్ ఝా (రోల్ నంబర్: 2313103182) – జనరల్, 99.9998189 పర్సంటేజ్, ర్యాంక్ 4, ఢిల్లీ (ఎన్‌సీటీ)
- అవికా అగర్వాల్ (రోల్ నంబర్: 230113256) – జనరల్, 99.9996832 పర్సంటేజ్, ర్యాంక్ 5, ఢిల్లీ (ఎన్‌సీటీ)
- జెనిల్ వినోద్‌భాయ్ భయానీ (రోల్ నంబర్: 2208206152) – జనరల్, 99.9996832 పర్సంటేజ్, ర్యాంక్ 6, గుజరాత్
- కేశవ్ మిత్తల్ (రోల్ నంబర్: 3802101056) – జనరల్, 99.9996832 పర్సంటేజ్, ర్యాంక్ 7, పంజాబ్
- ఝా భవ్య చిరాగ్ (రోల్ నంబర్: 2201115500) – జనరల్, 99.9996379 పర్సంటేజ్, ర్యాంక్ 8, గుజరాత్
- హర్ష్ కేదావత్ (రోల్ నంబర్: 4409201097) – జనరల్, 99.9995474 పర్సంటేజ్, ర్యాంక్ 9, ఢిల్లీ (ఎన్‌సీటీ)
- ఆరవ్ అగర్వాల్ (రోల్ నంబర్: 3114101176) – జనరల్, 99.9995474 పర్సంటేజ్, ర్యాంక్ 10, మహారాష్ట్ర
మహిళా టాపర్ ఎవరు?
ఈ జాబితాలో అవికా అగర్వాల్ మహిళా టాపర్‌గా నిలిచింది. ఆమె 99.9996832 పర్సంటేజ్ సాధించి.. ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 5 సంపాదించింది. ఢిల్లీ (ఎన్‌సీటీ)కి చెందిన అవికా, తన అద్భుతమైన పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ టాపర్లు నీట్ యూజీ 2025 పరీక్షలో అత్యుత్తమ స్కోర్‌లతో రాణించారు. వీరంతా జనరల్ విభాగానికి చెందిన వారు మరియు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు. ఈ విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొని, తమకు ఇష్టమైన వైద్య కళాశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది.

Share