Allam Gopala Rao Death..ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటులు అల్లం గోపాలరావు (Allam Gopala Rao ) ఈరోజు ఉదయం 8:00 గంటలకు అనారోగ్యం కారణంగా తన నివాసంలో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. అల్లం గోపాల్ రావుకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్ (Anil),సునీల్ (Sunil)ఉన్నారు. ఇక అల్లం గోపాల్ రావు పిల్లల విషయానికి వస్తే.. పెద్దబ్బాయి అనిల్ సీరియల్స్ తో పాటు సినిమాలలో కూడా నటిస్తున్నారు. గోపాలరావు మరణ వార్త అటు బుల్లితెరను.. ఇటు వెండితెరను ఆశ్చర్యంలో ముంచేసింది. ఆయన మృతిపై పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
నేడే అంత్యక్రియలు..
ఈరోజు ఉదయం అల్లం గోపాలరావు మరణించడంతో కుటుంబ సభ్యులు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి సి) మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
అల్లం గోపాల్ రావు సీరియల్స్..
అల్లం గోపాలరావు ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో మినిస్టర్ పాత్రలో నటించారు, రిషి కి , రిషి కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధాల ప్రోత్సహించే మంత్రి పాత్రలో ఈయన చాలా చక్కగా నటించారు. ఇకపోతే ఇటీవలే ఈ గుప్పెడంత మనసు సీరియల్ ముగిసిన విషయం తెలిసిందే. ఇందులోనే కాదు బ్రహ్మముడి సీరియల్ లో కూడా ఈయన నటించారు. బ్రహ్మముడి సీరియల్ లో జడ్జిగా కామెడీ పాత్ర చేశారు. అనామిక – కళ్యాణ్ విడాకుల కేసుకు సంబంధించిన ఎపిసోడ్లు న్యాయమూర్తిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. సుమారు రెండు మూడు ఎపిసోడ్స్లలో తన నటనతో మెప్పించారు.
ALSO READ:Priyanka Jain: పెళ్లి చేసుకోమని అడగడానికి.. అంత ఓవర్ యాక్షన్ అవసరమా ప్రియాంక?