Manchu Vishnu: సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటుల కోసం ప్రతి ఇండస్ట్రీలో ఒక భవనం అంటూ ఉంటుంది. అలా కోలీవుడ్లో నటీనటుల సంఘం అయినటువంటి నడిగర్ సంఘం నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ‘మా’ అసోసియేషన్ ఉంది. కానీ మా అసోసియేషన్ కి సంబంధించి బిల్డింగ్ మాత్రం లేదు. అయితే మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో అధ్యక్షుడిగా నిలబడ్డ మంచు విష్ణు (Manchu Vishnu) మా అసోసియేషన్ సభ్యుల కోసం ఒక భవనం నిర్మిస్తామని మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ భవనాన్ని పూర్తి చేయలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు మా అసోసియేషన్ కోసం నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను. కానీ వాళ్లే నన్ను అడ్డుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ మా బిల్డింగ్ ని అడ్డుకుంటుంది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
నిర్మాత తమ్మారెడ్డి మాటలపై విష్ణు రియాక్షన్..
తాజాగా కన్నప్ప (Kannappa) ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja)తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మా బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటివరకు దాని ఊసే లేదేంటి అని ప్రశ్నించగా.. తమ్మారెడ్డి కామెంట్స్ పై మంచు విష్ణు మాట్లాడుతూ.. “మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం.. నేను ఇప్పటికే చాలాసార్లు కట్టడానికి ప్రయత్నించాను.ప్రస్తుతం ఉన్న చాంబర్ బిల్డింగ్ ని పడగొట్టి అదే ప్లేస్ లో కొత్త ఛాంబర్ బిల్డింగ్ ని కట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నా సొంత డబ్బులతోనే మా ఛాంబర్ బిల్డింగ్ ని కడతాను. అయితే నాకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఓ భాగస్వామి కూడా ముందుకు వచ్చారు.కానీ మా ఛాంబర్ బిల్డింగ్ ని కట్టాలని చెప్పినా కూడా ఇతర నటీనటులు ఎవరూ నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఉన్న ప్లేస్ లో ఛాంబర్ బిల్డింగ్ మాత్రమే కాకుండా హైదరాబాద్ ఔటర్ నార్సింగిలో మరో బిల్డింగ్ ఉంది. అక్కడైనా మా ఛాంబర్ బిల్డింగ్ ని కొత్తగా ఓపెన్ చేద్దామని అడిగాను. కానీ మా అసోసియేషన్ సభ్యులందరూ ఆ బిల్డింగ్ వద్దు ఉన్న ఛాంబర్ బిల్డింగ్ లోనే మా ఆఫీస్ కావాలని డిమాండ్ చేశారు.అందుకే అక్కడికి ఆఫీస్ మార్చలేదు. ఇప్పుడున్న ప్లేసులో కడదామన్నా కూడా ఎవరూ నాకు మద్దతుగా నిలబడడం లేదు. అందుకే మా ఛాంబర్ బిల్డింగ్ పనులు ముందుకు సాగడం లేదు అంటూ మంచు విష్ణు తమ్మారెడ్డి భరద్వాజ్ తో చాలా నిరాశ పడుతూ మాట్లాడారు.
ఇప్పటికైనా సినీ పెద్దలు స్పందిస్తారా..?
అయితే మంచు విష్ణు మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ మంచు విష్ణు కి టాలీవుడ్ పెద్దలు అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, మురళీమోహన్,ప్రకాష్ రాజ్,నాగార్జున, వెంకటేష్ లు సహకరించడం లేదా.. వీరు సహకరించకపోవడం వల్లే మా అసోసియేషన్ బిల్డింగ్ పనులు ముందుకు సాగడం లేదా అంటూ మాట్లాడుతున్నారు. అయితే అందరూ కలిసికట్టుగా పని చేస్తే కచ్చితంగా మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మిస్తానని మంచు విష్ణు అంటున్నారు. పైగా సొంత డబ్బులతో ఆయన నిర్మిస్తానని ముందుకు వస్తే టాలీవుడ్ పెద్దలు ఎందుకు ఆయనకు సహకరించడం లేదని మాట్లాడుకుంటున్నారు. మరి మంచు విష్ణు కామెంట్లపై టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
ALSO READ:Deepika Padukone: ఇదే నా ‘నిజాయితీ’.. డైరెక్టర్ కి దీపిక గట్టి కౌంటర్!