Deepika Padukone: గత రెండు రోజుల నుండి దీపికా పదుకొనే (Deepika Padukone) పేరు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్లో ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న స్పిరిట్ మూవీలో మొదట హీరోయిన్ గా దీపిక పదుకొనేని ఫిక్స్ చేశారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా దీపికా పదుకొనేని తీసేసి ఆమె ప్లేస్ లో ‘యానిమల్’ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి డిమ్రీ (Tripti dimri) ని తీసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో దీపిక ను పక్కనపెట్టి త్రిప్తిని ఎందుకు తీసుకున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా వినిపించింది. అయితే దీపిక చేసిన పని వల్లే ఈమెను సినిమా నుండి తొలగించినట్టు ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ ద్వారా బయటపెట్టారు సందీప్ రెడ్డి వంగా. అయితే సందీప్ రెడ్డి వంగా పెట్టిన పోస్ట్ కి కౌంటర్గా దీపిక పదుకొనే తాజాగా కొన్ని కామెంట్లు చేసింది. మరి దీపిక పదుకొనే ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం..
డైరెక్టర్ సందీప్ కి కౌంటర్ ఇచ్చిన దీపిక..
స్పిరిట్ సినిమా నుండి దీపిక పదుకొనేని తప్పించి త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో దీపిక ను తప్పించడం వెనక ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా పెట్టిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీపిక పేరు నెట్టింట్లో మార్మోగిపోయింది. అయితే తాజాగా దీపిక ఓ ఫ్యాషన్ షోలో మాట్లాడుతూ.. “ఎల్లప్పుడూ నేను నా మనసు చెప్పిందే వింటా.. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే నా మనసు చెప్పిందే వింటా.. లైఫ్ లో బ్యాలెన్స్డ్ గా ఉండడం ముఖ్యం. అందుకే లైఫ్ లో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ఉండాలి. నా మనసు ఏం చెప్తే అది విని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటాను.అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొనే శక్తి నాకు ఉంటుంది” అంటూ దీపిక పదుకొనే చెప్పుకొచ్చింది. అయితే దీపిక పదుకొనే మాట్లాడిన మాటలు సందీప్ రెడ్డి వంగాకి కౌంటర్ గా ఉన్నాయని సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక దీపిక ఫ్యాన్స్ అయితే సందీప్ రెడ్డి వంగాకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది అంటూ దీపిక మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తున్నారు.
అసలు వివాదం ఏంటంటే?
ఇక దీపిక – సందీప్ రెడ్డి వివాదం ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.. అందులో దీపిక పదకొనేపై పరోక్షంగా పోస్ట్ పెట్టారు. నేను ఓ నటుడిని నమ్మి 100% స్టోరీ చెప్పాను. కానీ వారు మాత్రం నేను చెప్పిన స్టోరీని లీక్ చేశారు.కథ మొత్తం లీక్ చేసిన నాకేమీ భయం కాదు. అయితే కథ చెబుతున్నామంటే నటీనటులను పూర్తిగా నమ్మి చెబుతాం.కాబట్టి అనధికారికంగా అగ్రిమెంట్ చేసుకున్నట్టే. కానీ ఇలా పిఆర్ టీం లతో కథ లీక్ చేయడం ఏంటి అంటూ #DirtyPR team అనే ఏ యాష్ ట్యాగ్ తో పోస్ట్ పెట్టారు.అయితే స్పిరిట్ సినిమాలో చాలా ఏ రేటెడ్ సీన్స్ ఉంటాయని కొన్ని వార్తలు రావడంతో దీనికి కౌంటర్ గా సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు.
ALSO READ:Teja Sajja Mirai Teaser: మిరాయ్ టీజర్ రిలీజ్.. ఈసారి అంతకుమించి అనేలా ఉందే!