BigTV English
Advertisement

Manchu Vishnu: ‘కన్నప్ప’పై మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ట్రోలర్స్‌కి ఈసారి..

Manchu Vishnu: ‘కన్నప్ప’పై మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ట్రోలర్స్‌కి ఈసారి..

Manchu Vishnu: మంచు విష్ణు తన కెరీర్‌లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న చిత్రమే ‘కన్నప్ప’. భక్త కన్నప్ప జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని మంచు విష్ణు చాలా కష్టపడుతున్నాడు. ఈ కథ పూర్తయినప్పటి నుండి తానే స్వయంగా ప్రీ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకున్నాడు. క్యాస్టింగ్ దగ్గర నుండి షూటింగ్ వరకు అన్నింటిలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు విష్ణు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను ఏర్పాటు చేసి ‘కన్నప్ప’ గురించి మరికొన్ని విశేషాలను పంచుకున్నాడు. ఈ ఈవెంట్‌లో విష్ణుతో పాటు అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత టీమ్ మొత్తం శ్రీకాళహస్తిని కూడా దర్శించుకున్నారు.


మోహన్ బాబు కుమారుడిని

‘కన్నప్ప’ సినిమా కేవలం తెలుగులోనే కాదు హిందీతో పాటు ఇతర సౌత్ భాషల్లో కూడా ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే ఈ మూవీ ట్రైలర్‌ను హిందీలో లాంచ్ చేయడం కోసం భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశాడు మంచు విష్ణు. ఈ ఈవెంట్‌లో విష్ణు మాట్లాడుతూ.. ‘‘నేను మోహన్ బాబు కుమారుడిని అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఆయన లేకపోతే నేను హీరో అయ్యేవాడిని కాదు. అక్షయ్ కుమార్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది కూడా ఆయన వల్లే. ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్ నుండి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇందులో నటించిన అందరూ యాక్టర్స్ తమ పాత్రకు న్యాయం చేశారు’’ అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.


మనసుకు హత్తుకునేలా

‘‘కన్నప్ప (Kannappa) సినిమా నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఆలోచనా విధానంలో మార్పులు వచ్చాయి. ఇది నాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. నా పర్సనల్ జర్నీ. నేను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శించుకుంటున్నాను. కన్నప్ప కథతో నాకు ఒక బాండింగ్ ఏర్పడింది. ఇందులో ఉండే నమ్మకం, త్యాగం మనసుకు హత్తుకునేలా ఉంటుంది. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్ లాంటి నటులు కూడా ఈ జర్నీలో భాగమవ్వడం నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ఈ మా కథ ప్రపంచంలోని ప్రతీ ప్రేక్షకుడికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది హద్దులు లేని కథ’’ అని ‘కన్నప్ప’ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

Also Read: ‘కన్నప్ప’ను రెండుసార్లు రిజెక్ట్ చేసిన అక్షయ్.. చివరికి మంచు విష్ణు ఎలా ఒప్పించాడంటే.?

ట్రోలర్స్‌కు నో ఛాన్స్

‘కన్నప్ప’ హిందీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు విష్ణు (Manchu Vishnu) చాలా ఆలోచించి మాట్లాడాడని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. మామూలుగా విష్ణు ఏ ఈవెంట్‌లో ఏం మాట్లాడినా కూడా అది ట్రోలర్స్‌కు మంచి స్టఫ్ అవుతుంది. కానీ ఈసారి అలా జరగకుండా జాగ్రత్తపడ్డాడు. కేవలం ‘కన్నప్ప’ గురించే ప్రేక్షకులకు తెలియజేశాడు. అంతే కాకుండా ఇటీవల ఈ సినిమా నుండి విడుదలయిన పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ‘కన్నప్ప’ హిట్ అవుతుందేమో అనే ఆలోచన చాలామంది ప్రేక్షకుల్లో మొదలయ్యింది. ‘కన్నప్ప’ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. భారీ క్యాస్టింగ్ వల్ల ఈ సినిమాకు ఇప్పటికే చాలా హైప్ లభించింది. ఫైనల్‌గా 2025 ఏప్రిల్ 25న రిలీజ్‌కు సిద్ధమయ్యింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×