BigTV English

Akshay Kumar: ‘కన్నప్ప’ను రెండుసార్లు రిజెక్ట్ చేసిన అక్షయ్.. చివరికి మంచు విష్ణు ఎలా ఒప్పించాడంటే.?

Akshay Kumar: ‘కన్నప్ప’ను రెండుసార్లు రిజెక్ట్ చేసిన అక్షయ్.. చివరికి మంచు విష్ణు ఎలా ఒప్పించాడంటే.?

Akshay Kumar: ఈరోజుల్లో ఒక సినిమాకు హైప్ తీసుకొని రావడం కోసం అందులో భారీ క్యాస్టింగ్ ఉండాలని చాలామంది మేకర్స్ భావిస్తున్నారు. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో సైతం మరొక స్టార్ హీరో గెస్ట్ రోల్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ అలా భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాంటే ఏదో మ్యాజిక్ జరగాలి. ఇప్పుడు అలాంటి క్యాస్టింగ్‌తోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయిన సినిమా ‘కన్నప్ప’. శివుడికి భక్తుడైన భక్త కన్నప్ప జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహాశివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. కానీ ముందుగా ఈ పాత్రను తాను రెండుసార్లు రిజెక్ట్ చేశానని బయటపెట్టాడు అక్షయ్ కుమార్.


అందుకే ఒప్పుకున్నాను

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ ఎంతోమంది స్టార్ నటీనటులు ఉన్నారు. అందులో అక్షయ్ కుమార్ కూడా ఒకడు. ఇప్పటికే శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ముంబాయ్‌లో జరిగిన ఈవెంట్‌లో విష్ణుతో పాటు అక్షయ్ కుడా పాల్గొన్నాడు. ‘కన్నప్ప’ ఆఫర్‌ను ఒప్పుకునే ముందు రెండుసార్లు రిజెక్ట్ కూడా చేశానని తానే స్వయంగా ప్రకటించాడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ‘‘మొదట్లో నేను అంత నమ్మకంగా లేను. అందుకే రెండుసార్లు ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను. కానీ నేను ఆ మహాశివుడి పాత్రను ఇండియన్ సినిమాలో వెండితెరపై ఆవిష్కరించగలను అని మంచు విష్ణు నాపై చూపించిన నమ్మకం నేను ఒప్పుకునేలా చేసింది’’ అని బయటపెట్టాడు.


విజువల్ మాస్టర్‌పీస్

‘‘కన్నప్ప కథ చాలా పవర్‌ఫుల్. అంతే కాకుండా ఇది ప్రేక్షకులను చాలా కదిలిస్తుంది. ఇదొక విజువల్ మాస్టర్‌పీస్‌గా తెరకెక్కింది. ఇలాంటి ప్రయాణంలో నేను కూడా భాగమయినందుకు చాలా గర్వపడుతున్నాను’’ అని ‘కన్నప్ప’పై నమ్మకం వ్యక్తం చేశాడు అక్షయ్ కుమార్. ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. 2025లో విడుదలయ్యే వాటిలో ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కన్నప్ప’ (Kannappa) కూడా యాడ్ అయ్యింది. దానికి ముఖ్య కారణం ఇందులో ఉన్న భారీ క్యాస్టింగే. అంతే కాకుండా ఇందులో ప్రభాస్ (Prabhas) కూడా ఒక గెస్ట్ రోల్ చేయడంతో పాన్ ఇండియా ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. 2025 ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమయ్యింది.

Also Read: భార్యతో సహా స్టార్ హీరో అనుమానాస్పద మృతి.. ఇంతకీ ఏం జరిగింది.?

కాంట్రవర్సీపై స్పందన

తాజాగా ‘మహాకాళ్ ఛలో’ అనే ఒక ఆల్బమ్ సాంగ్‌ను విడుదల చేశాడు అక్షయ్ కుమార్. దాని పోస్టర్‌లో తను శివలింగాన్ని హత్తుకొని కనిపిస్తాడు. దీంతో ఇది కాంట్రవర్సీకి దారితీసింది. ఈ కాంట్రవర్సీ గురించి కూడా ఈ ఈవెంట్‌లో ప్రస్తావించాడు అక్షయ్. ‘‘దేవుడు మన తల్లిదండ్రులతో సమానం అని చిన్నప్పుడు అందరికీ నేర్పించే ఉంటారు కదా. మరి ప్రేమతో వారిని హగ్ చేసుకుంటే తప్పేంటి? అందులో తప్పేమైనా ఉందా? ఇందులో తప్పేమీ జరగలేదు. ఆయన నుండి నాకు శక్తి వస్తుంది. నా భక్తిని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే అది నా తప్పు కాదు’’ అని చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×