Manchu Vishnu: కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం గురించి ప్రేక్షకులు ఇంకా పూర్తిగా మర్చిపోనే లేదు. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య ఆస్తుల కోసం మొదలయిన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఆ తర్వాత ప్రేక్షకులు అందరిలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తండ్రీకొడుకులు అన్న విషయం మర్చిపోయి ఒకరి వల్ల మరొకరికి ప్రాణ హాని ఉందంటూ కేసులు పెట్టుకునేవరకు వెళ్లింది. ఇప్పటికీ కూడా మంచు మనోజ్.. విష్ణు గురించి, తన తండ్రి మోహన్ బాబు (Mohan Babu) గురించి ఏదో ఒక విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు. ఇదే సమయంలో మంచు విష్ణు సిబ్బంది చేయకూడని పని చేస్తూ అడవిలో దొరికిపోయారు.
చర్యలు తీసుకోవాల్సిందే
అడవిలో వేటకు వెళ్లడం, అడవి జంతువులను చంపడం చట్టరీత్యా నేరం. కానీ మంచు విష్ణు సిబ్బంది అదే పని చేస్తూ దొరికిపోయింది. ఒక అడవి పందిని వేటాడి దానిని తాడుకు కట్టుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో బయటికొచ్చింది. వీరంతా మంచు విష్ణు సిబ్బంది అని తెలిసిన తర్వాత ఈ వీడియో మరింత వైరల్ అయ్యింది. ఇలా చేయడం చట్టరీత్యా నేరమంటూ.. చేసిన వారితో పాటు మంచు విష్ణుపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ గొడవలతో తలమునకలయ్యి ఉన్నాడు మంచు విష్ణు. ఇంతలోనే తన సిబ్బంది వల్ల మరికొన్ని చిక్కుల్లో పడ్డాడు.
Also Read: ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఉంది.. కోరికను బయటపెట్టిన ఉపేంద్ర
చెప్పినా వినలేదు
జల్‌పల్లిలోని అడవిలో మంచు విష్ణు (Manchu Vishnu) సిబ్బంది వేట కొనసాగించింది. వారంతా కలిసి అడవి పందులను వేటాడారు. చిట్ట అడవిలోకి వెళ్లిన మంచు విష్ణు మ్యానేజర్ కిరణ్.. అక్కడ అడవి పందులను వేటాడి తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వీడియోలో రికార్డ్ అయ్యాయి. కిరణ్ అడవి పందిని వేటాడగా ఎలక్ట్రీషియన్ అయిన దేవేంద్ర ప్రసాద్ దానిని బంధించి తీసుకెళ్లాడు. మంచు విష్ణు సిబ్బంది అడవిలోకి వేటకు వెళ్తున్నారని ముందుగానే గుర్తించిన మంచు మనోజ్ (Manchu Manoj).. పలుమార్లు వారిని అడ్డుకోవాలని ప్రయత్నించినా వారు వినలేదని సమాచారం. ఎంత చెప్పినా, హెచ్చరించినా కిరణ్, దేవేంద్ర ప్రసాద్.. మనోజ్ మాటలను పట్టించుకోలేదట.
మనోజ్ లీక్ చేశాడా.?
అడవి జంతువులకు హాని చేస్తే ఎంతటి సెలబ్రిటీకి అయినా శిక్ష పడక తప్పదు. మంచు విష్ణు సిబ్బంది ఇలా చేస్తుందనే విషయం మనోజ్‌కు తెలిసి అడ్డుచెప్పాడు. అదే విషయం విష్ణుకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ తెలిసినా తను అడ్డుచెప్పలేదా? అని ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి. అంటే విష్ణుకు తెలిసే ఇదంతా జరిగుండొచ్చని, తనకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉండి ఉండవచ్చని అనుమానాలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వీడియోలు బయటికి ఎలా వచ్చాయి, మంచు మనోజే లీక్ చేయించి ఉంటాడా అని కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మరో వివాదంలో మంచు విష్ణు..
జల్ పల్లి అడువుల్లో అడవి పందులను వేటాడి తీసుకెళ్లిన విష్ణు మేనేజర్ కిరణ్.
సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైన వీడియోలు.
వన్య ప్రాణాలను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్.#jalpally #Vishnu #Kiran #Pig #LatestNews #bigtvcinema pic.twitter.com/kOvkVOaJ4G— BIG TV Cinema (@BigtvCinema) December 31, 2024