Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కన్నప్ప(Kannappa). మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన తరుణంలో చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించి హార్డ్ డిస్క్ దొంగలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజులలో విడుదల కావలసిన కన్నప్ప సినిమాకు సంబంధించి హార్డ్ డిస్క్ మాయం కావడం వెనుక చిత్ర బృందానికి సంబంధించిన రఘు అనే వ్యక్తి సహాయం చేశారనే వార్తలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇలాంటి తరుణంలోనే మరికొందరు ఈ వివాదంలోకి విష్ణు సోదరుడు మంచు మనోజ్(Manchu Manoj) ను కూడా లాగుతున్నారు. మంచు విష్ణు మనోజ్ మధ్య గత కొద్దిరోజులుగా వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలోనే కన్నప్ప సినిమా ద్వారా రివేంజ్ తీర్చుకోవడం కోసమే మంచు మనోజ్ హార్డ్ డిస్క్ మాయం చేయించారన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ వివాదం గురించి మంచు మనోజ్ ఎక్కడ స్పందించలేదు. అదేవిధంగా మంచు విష్ణు కూడా ఈ విషయంపై గట్టిగా స్పందించనూ లేదు.
సామాన్ల దొంగ…
ఇలా హార్డ్ డిస్క్ మాయం కావటంలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు హార్ట్ డిస్క్ మాయం కాలేదని ఇది కూడా సినిమా ప్రమోషన్ లో ఒక భాగమే అంటూ కొందరు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మంచు విష్ణు తన X ఖాతా ద్వారా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఈ సినిమా కోసం నేనొక్కడినే కాదు, కన్నప్ప టీం మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాము. నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను రసూల్ ఖాన్(రఘు) దయచేసి నా కంటెంట్ నాకు వెనక్కి ఇచ్చే అంటూ ఇందులో రసూల్ ఖాన్ అంటే మరెవరో కాదు సామాన్ల దొంగ అంటూ హీరో ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయటంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
హార్డ్ డిస్క్ మాయం… పబ్లిసిటీ స్టంటా…?
ఈ విధంగా మంచు విష్ణు ఐడి నుంచి ఈ విధమైనటువంటి ట్వీట్ రావడంతో ఇది చూసిన అభిమానులు ఖచ్చితంగా ఈ ట్వీట్ మంచు విష్ణు చేసింది కాదని, కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని స్పష్టం అవుతుంది. ఇది చూసిన కొంతమంది నెటిజన్లు మన మంచు విష్ణు అన్నపై ఎందుకయ్యా ఇంత పగ పట్టారు అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం పబ్లిసిటీ స్టంట్ అదిరిపోయింది అంటూ ఈ పోస్టుపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయం కావటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమా విషయంలో కూడా ఇలా జరగలేదని మొదటిసారి ఇలా జరగడంతో అందరూ షాక్ లో ఉన్నారు.
https://x.com/OutOfWorldTel/status/1927268929937838244