MP Kangana: వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. గ్లామర్ ఇండస్ట్రీలో ఈమెని ఫైర్‌బ్రాండ్‌గా చెబుతుంటారు. ప్రస్తుతం సినిమాల మాట గురించి కాసేపు పక్కనబెడదాం. ఓ విషయంలో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో శివాలెత్తారు. ఆ రేంజ్‌లో ఆగ్రహం వెనుక అసలు కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం.
రాజకీయాల్లోకి వచ్చిన బొత్తుగా కనిపించడం మానేశారు ఎంపీ కంగనా రనౌత్. అప్‌కోర్సు కారణాలు చాలానే ఉంటాయను కోండి. గత ఎన్నికల్లో మండి నుంచి బీజేపీ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత తొలిసారి పార్లమెంటులోకి అడుగు పెట్టారు. సమావేశాల సమయంలో అప్పుడప్పుడు కనిపిస్తారు ఆమె. ఈ మధ్య బొత్తుగా కనిపించడం మానేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై శివాలెత్తారు ఎంపీ కంగనా. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆమె ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చింది. అది చూసి ఆమె షాకయ్యింది. ఆ ఇంట్లో తాము నివాసం ఉండడంలేదని, అలాంటప్పుడు అంత బిల్లు ఎలా వచ్చిందని రుసరుసలాడారు.
తన బిల్లు వెనుక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులే కారణమన్నది ఆమె మాట. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం సిగ్గుచేటుగా వర్ణించారు. మనందరికీ ఒక అవకాశం ఉందని, ఇలాంటి సమస్యలపై క్షేత్రస్థాయిలో మనమంతా ప్రతిఘటించాలని అన్నారు. దేశంతోపాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. తోడేళ్ల చెర నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని మందిలో ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: దళితుడు ప్రవేశించాడని ఆలయం శుద్ధి చేసిన బీజేపీ నేతలు
కంగనా ఆగ్రహం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా ఎదిగేందుకు ఆమె వేసిన స్కెచ్‌లో భాగమని అంటున్నారు. ఈ మధ్యకాలంలో హిమాచల్ ప్రదేశ్‌లో కమలనాథులు సైలెంట్‌గా ఉన్నారట. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లు ఓ అడుగు ముందుకేసి ప్రత్యర్థులపై శివాలెత్తారు.
మరి కంగనా వ్యాఖ్యలపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తానికి రాజకీయాలను కంగనా బాగానే వంట బట్టించుకున్నారనే కామెంట్స్ లేకపోలేదు.
#WATCH | Mandi, Himachal Pradesh: BJP MP Kangana Ranaut says, "… There is a wave of PM Modi in the entire country and saffron… But it is painful to watch Himachal Pradesh's condition… Their agencies are probing samosas. We feel embarrassed about what is happening… It is… pic.twitter.com/23bkYv3Gmh
— ANI (@ANI) April 8, 2025