Manchu Vishnu vs Manoj : కుటుంబంతో కలిసి జల్‌పల్లి నివాసానికి చేరుకున్న మంచు మనోజ్.
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ వేరే ఇంట్లో ఉంటున్నాడు. ఈరోజు ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని, ఇంట్లోనికి వెళ్లడానికి ప్రయత్నించాడు. తన కారుని, సోదరుడు విష్ణు తీసుకువెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోజ్. తను ఊర్లో లేనప్పుడు తన ఇంటిలోని వస్తువులన్నీ తీసుకువెళ్లారని ఆరోపణలు చేస్తున్నాడు మనోజ్.
మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మనొజ్..
మనోజ్ మీడియాతో మాట్లాడుతూ..’నా ఇంటిలోకి నన్ను వెళ్ళనివ్వడం లేదు. మా ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి. అవి ఇవ్వమని అడుగుతున్నా.. ఏ రోజు నేను ఆస్తి కోసం కొట్లాట చేయలేదు. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేనంటే విష్ణుకి కుల్లు. కోర్ట్ ఆర్డర్ ఉన్నా కానీ నన్ను లోపలికి అనుమతించడం లేదు. తప్పుడు సంతకాలతో కోర్టును పక్కదారి పట్టిస్తున్నారు. మా అన్న కెరియర్ కోసం నన్ను వాడుకుంటున్నాడు. మా నాన్న కోరిక మేరకు మా అన్న కోసం ఆయన సినిమాలో ఆడవేషం వేశాను. నన్ను అప్పుడు వాడుకొని ఇప్పుడు వదిలేస్తున్నారు’ అని మనోజ్ మీడియాతో చెప్పారు.
కావాలనే దీన్ని కుటుంబ గొడవగా మార్చారు: మంచు మనోజ్
నేను మొదటి నుంచి ఏమీ కోరట్లేదు.. అడగట్లేదు
మాకు రక్షణ ఇవ్వాలని పోలీసులను కోరాం
– మంచు మనోజ్ https://t.co/1YB0h2m4w3 pic.twitter.com/eXdZTg25vq
— BIG TV Breaking News (@bigtvtelugu) April 9, 2025