CM Chandrababu House: వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యర్థులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇందులోభాగానే రాజధానితో కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 9న అంటే (బుధవారం ఉదయం) శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి.
రాజధాని అమరావతిలో ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. బుధవారం ఉదయం దాదాపు 9 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబుతోపాటు భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ హాజరయ్యారు. అమరావతిలోని సచివాలయం వెనుక రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. అక్కడ నిర్మాణం చేపట్టడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.
అమరావతిలో వెలగపూడికి చెందిన రైతు నుంచి ఐదు ఎకరాలను కొనుగోలు గతేడాదిలో కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఒకానొక సందర్భంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే భూమి చదును చేయడం మొదలుపెట్టారు. 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి ఈ నిర్మాణం జరగనుంది.
ఎక్కువ భాగం గ్రీనరీకి కేటాయించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ఇంటి నిర్మాణ బాధ్యతను ఎస్ఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేపడుతోంది. ఈ మేరకు నిర్మాణ కంపెనీకి నిర్మాణంపై సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. ఆవరణలో పచ్చదనానికి ప్రయార్టీ ఇస్తూనే మొక్కలు ఎక్కువగా పెంచాలని నిర్ణయించారు.
ALSO READ: ఊడదీయడానికి అరటి తొక్క కాదు, జగన్‌కు ఎస్ఐ మాస్ వార్నింగ్
పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం చేయాలన్నది అధినేత ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శంకుస్థాపన పూర్తి కావడంతో రేపో మాపో పనులు మొదలు కానున్నాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అమరావతిలో ఉంటున్న ఇల్లు కాసింత ఇరుకుగా ఉంటుంది.
కీలకమైన నేతలు ఇంటికి వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉండేది. దీనికితోడు వర్షాకాలంలో నీరు అటు వైపు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఇవన్నీ గమనించిన చంద్రబాబు, ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సచివాలయం, ఆ పక్కనే అసెంబ్లీ ఉండడంతో ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉండదని అంటున్నారు. ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు.
సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌తోపాటు నారావారిపల్లెలో సొంత ఇళ్లు ఉన్నాయి. కుప్పంలో ఆయనకు సొంత ఇల్లు లేదు. ఎన్నికల సమయంలో ఇవే అంశాలను ప్రజల ముందు పెట్టి ప్రశ్నించేవారు వైసీపీ అధినేత జగన్. ప్రస్తుతం కుప్పంలో నిర్మిస్తున్న ఇల్లు ముగింపు దశకు వచ్చింది. శ్రావణం లేదా కార్తీక మాసంలో ప్రారంభించే అవకాశముంది. ఇప్పుడు అమరావతి ఇల్లు వంతైంది.
కాసేపట్లో సిఎం చంద్రబాబు నాయుడు గారి సొంత ఇంటికి భూమి పూజ చేయనున్న సిఎం దంపతులు..
5 ఎకరాల్లో కొనుగోలు చేసిన ఈ ఇంటిని. 18 నుంచి 20నెలల్లో పూర్తి చెయ్యాలని నిర్ణయం.#ChandrababuNaidu #TDPTwitter #AndraPradesh pic.twitter.com/86jThyyR8Q
— TDP Trends (@Trends4TDP) April 9, 2025