Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 (Champions Trophy 2025) కి ముందు ఆస్ట్రేలియాకి భారీ షాక్ తగిలింది. మరో రెండు వారాలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ పాట్ కమీన్స్ ఛాంపియర్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నికి దూరం కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రు మెక్ డోనాల్డ్ పరోక్షంగా వెల్లడించారు. దీంతో అతడి స్థానంలో కెప్టెన్ గా ఆస్ట్రేలియా జట్టును ఎవరు నడిపిస్తారనే విషయాన్ని కూడా తెలిపాడు.
Also Read: Ricky Ponting Wine: నా లిక్కర్ తాగండ్రా బాబు.. ఇండియన్స్ ను వేడుకుంటున్న పాంటింగ్ ?
గత కొంతకాలంగా పాట్ కమీన్స్ ఎడమకాలి చీలమండ సమస్యతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా అతడు (Champions Trophy 2025) మెగా టోర్నికి దూరం కానున్నట్లు సమాచారం. ఇండియా – ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తరువాత ఈ గాయం మరోసారి తీవ్రతరం అయింది. ఇక తాజాగా అతడి భార్య రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కారణంగా అతడు శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ కి కూడా దూరమయ్యాడు.
ఈ సమయంలో కమీన్స్ స్థానంలో లంక సిరీస్ కి స్టీవ్ స్మిత్ ని కెప్టెన్ గా నియమించారు. ప్రస్తుతం చాంపియన్ ట్రోఫీకి ముందు కమీన్స్ గాయం మళ్ళీ తిరగబడడంతో ఆస్ట్రేలియా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కమీన్స్ దూరమైన పక్షంలో ట్రావీస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా కెప్టెన్సీ రేస్ లో ఉంటారని కోచ్ మెక్ డోనాల్డ్ అన్నారు. లంకతో జరిగే వన్డే సిరీస్ కోసం నేడు ఆస్ట్రేలియా అక్కడికి బయలుదేరాల్సి ఉంది.
ఈ క్రమంలోనే కోచ్ మెక్ డోనాల్డ్ మాట్లాడుతూ.. ” శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్ బయలుదేరింది. ఈ టీమ్ లో పాట్ కమీన్స్ లేడు. అతడు ఇప్పట్లో బౌలింగ్ ని మళ్లీ ప్రారంభించలేడు. ఎందుకంటే అతడి గాయం ఇంకా తగ్గలేదు. అందుకే ఇప్పుడు (Champions Trophy 2025) మాకు కొత్త కెప్టెన్ అవసరం. స్టీవ్ స్మిత్ లేదా ట్రావీస్ హెడ్ లలో ఒకరిని ఎంపిక చేసే చర్చలు జరుగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి వారిని సిద్ధం చేయాలి.
Also Read: Rashid Khan: T20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ సంచలన రికార్డు.. చరిత్రలోనే తొలి ప్లేయర్!
శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ లో స్మిత్ అద్భుతంగా రాణించాడు. అంతర్జాతీయ వన్డేలో స్మిత్ ప్రదర్శన బాగుంటుంది. ఇక జోష్ హెజిల్ వుడ్ ఫిట్నెస్ సాధించేందుకు పోరాడుతున్నాడు. అతడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం అనుమానమే” అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా జట్టు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. ఇప్పుడు కమీన్స్, హెజిల్ వుడ్ కూడా మెగా టోర్నీకి దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టు విజయా అవకాశాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని విశ్లేషకుల అంచనా.
🚨 PAT CUMMINS SET TO MISS 2025 CHAMPIONS TROPHY. 🚨
– Steven Smith or Travis Head could lead Australia. (Espncricinfo). pic.twitter.com/E1Zi8dpwca
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2025