Thuglife : మణిరత్నం ను చాలామంది తెలుగు ప్రేక్షకులు ముద్దుగా లవ్ గురు అని పిలుచుకుంటారు. మణిరత్నం ఎన్ని జోనర్స్ లో సినిమా చేసినా కూడా మణిరత్నం చేసిన లవ్ స్టోరీస్ కు మాత్రమే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. లవ్ స్టోరీ ని అంత అద్భుతంగా చూపిస్తాడు మణి రత్నం. ఇకపోతే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాని తెలుగు గాడ్ ఫాదర్ గా చాలామంది పరిగణిస్తారు. కమల్ హాసన్ నటించిన సినిమా ఎప్పటికీ ఎవరి గ్రీన్. ఆ సినిమా తర్వాత మళ్లీ వారి కాంబినేషన్లో సినిమా రావడానికి 37 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం థగ్ లైఫ్ అనే సినిమాను చేస్తున్నాడు మణిరత్నం.
ఇక ప్రస్తుతం కమల్ హాసన్ తో చేస్తున్న ఈ థగ్ లైఫ్ సినిమాలో చాలామంది పెద్దపెద్ద నటులు నటిస్తున్నారు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిపోయినట్లు సమాచారం వినిపిస్తుంది. ఎంతోమంది పెద్ద స్టార్స్ తో ఈ సినిమాను ఇంత త్వరగా పూర్తి చేయటం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమాలు శింబు ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను నేడు నిర్వహించింది చిత్ర యూనిట్.
పాత ఐడియానే డెవలప్ చేశారు
కమల్ హాసన్ మణిరత్నం కలిసి చాలా కథల గురించి చర్చించారట. వాటిలో కమల్ హాసన్ స్క్రిప్స్ లో తన ఓల్డ్ ఐడియా ఒకటి మణిరత్నం కి విపరీతంగా నచ్చిందట. అయితే కమల్ హాసన్ ఇచ్చిన ఆ ఓల్డ్ ఐడియాతో మణిరత్నం (Mani Rathanam) ఒక కొత్త స్క్రిప్టును తయారు చేశాడట. కమల్ హాసన్ ఐడియాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మణిరత్నం తన సొంత రూట్ లో కథను తయారుచేసినట్లు కమలహాసన్ తెలిపారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో మ్యూజికల్ హిట్స్ ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ సినిమాకి రెహమాన్ ఎటువంటి మ్యూజిక్ ఇస్తాడు అని అందరిలో ఒక క్యూరియాసిటీ ఉంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను నేడు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన ఈ సాంగ్కు లిరిక్స్ కమలహాసన్ అందించారు. ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Naveen Chandra: ఇండస్ట్రీలో నవీన్ చంద్రని వాడుకోవడం తేలిలా.. రాకేష్ కామెంట్స్ వైరల్