OTT Movie : బెంగాల్ సినిమాలు ప్రస్తుతం ఓటీటీ లో హల్చల్ చేస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ తో ఎక్కువగా వస్తున్న ఈ సినిమాలు, ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ ఇండస్ట్రీ నుంచి కూడా కొత్త కొత్త స్టోరీలతో ముందుకు వస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ బెంగాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ పేరు ఏమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
చోర్కి (Chorki) లో
ఈ బంగ్లాదేశీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫ్లోర్ నంబర్ 7’ (Floor Number 7). 2022 లో విడుదలైన ఈ మూవీకి రైహాన్ రఫీ దర్శకత్వం వహించారు. ఇందులో షబ్నం బబ్లీ, షహరియార్ నజీమ్ జాయ్, రాజ్ మానియా, సుమోన్ అనోవర్ నటించారు. ఒక ప్రముఖ నటుడు సద్మాన్ చౌదరి మర్డర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇది చోర్కి (Chorki) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సబ్మన్ చౌదరి ప్రముఖ హీరోగా బాగా పేరు సంపాదిస్తాడు. ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా, క్లైమాక్స్ సీన్ లో హీరోయిన్ గన్ తో హీరోని షూట్ చేయాల్సి ఉంటుంది. ఇక షూటింగ్ మొదలుపెట్టాక హీరోయిన్ షూట్ చేస్తుంది. ఆ సీన్ బాగా పండటంతో హీరోయిన్ ని అభినందిస్తుంటారు. ఇంతలో కింద పడిపోయిన హీరో పైకి లేవకుండా జీవచ్ఛవంలా పడి ఉంటాడు. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. హీరో అప్పటికే చనిపోయి ఉంటాడు. వెంటనే డైరెక్టర్ పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెడతారు. షూటింగ్ సెట్ లో ఉన్న అందరూ అనుమానంగానే కనపడతారు. నకిలీ గన్ ప్లేసులో, ఒరిజినల్ గన్ ను ఎవరు మార్చారనే ఆ విషయం మీద ఫోకస్ పెడతారు పోలీసులు. నిజానికి ప్రొడ్యూసర్ హీరోతో ఐదు సినిమాలు కాంట్రాక్ట్ చేసుకోవాలనుకుంటాడు. అయితే హీరోయిన్ విషయంలో ఇద్దరికీ గొడవ జరగడంతో ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేసుకుంటాడు ప్రొడ్యూసర్.
మరోవైపు ఈ సినిమా, హీరో హీరోయిన్ల గొడవల కారణంగా చాలాకాలం వాయిదా వేస్తారు. ఓవైపు దర్శకుడు కూడా వీళ్ళపై విసుకు చెంది ఉంటాడు. హీరోయిన్ తో కాకుండా, హీరోకి మరో అమ్మాయితో రిలేషన్షిప్ ఉంటుంది. ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాక, పోలీసులు ఈ కేసును ఒక కొలిక్కి తెస్తారు. ఈ కేసు దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు బయటకి వస్తాయి. చివరికి షూటింగ్ స్పాట్లో గన్ మార్చింది ఎవరు ? సినిమాను ఆలస్యం చేశారనే కోపంలో ఉన్న డైరెక్టరా? తనతోనే ఉండి, మరొక అమ్మాయితో తిరుగుతున్నాడని కోపంగా ఉన్న హీరోయిన్ ప్లాన్ వేసిందా ? ప్రొడ్యూసర్ తో విభేదాల కారణంగా ఇది జరిగిందా ? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఆ హౌస్ లోకి వెళ్తే అంతే సంగతులు … భయపెడుతూ కడుపుబ్బ నవ్వించే హారర్ థ్రిల్లర్