Tirumala News: కూటమి సర్కార్ వచ్చిన తర్వాత తిరుమలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. దేవుడి-భక్తులకు దూరం పెంచింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ గ్యాప్ లేకుండా చర్యలు చేపడుతోంది. తిరుమల శ్రీవారి సేవలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
శ్రీవారి సేవా టికెట్ల కోసం
తిరుమల ఏడు కొండల్లో కొలువైన శ్రీహరిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శ్రీవారి దర్శనభాగ్యం కాకుండా సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ. తాజాగా శ్రీవారి సేవ తిరుమలతోపాటు తిరుపతి కూడా పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ సేవల జులై నెల కోటాను విడుదల చేయనుంది.
మే 29న గురువారం ఉదయం 11 గంటలకు టికెట్లు విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు, శ్రీవారి సేవకులుగా బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది. శ్రీవారి సేవకులుగా వచ్చేవారికి తిరుమల దర్శనం, వసతి ఉచితంగా కల్పించనుంది.
భక్తులకు మంచిగా సేవలు అందించాలని శ్రీ సత్యసాయి సేవా సంస్థ, ఇషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు. శ్రీవారి సేవలో నాణ్యత పెంచడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. సీనియర్ సేవకులు గ్రూప్ లీడర్లుగా ఇకపై ఉండనున్నారు.
ALSO READ: పొలంలో అరుదైన వజ్రం.. కర్నూలు రైతు పంట పండింది
గడిచిన రెండేళ్లుగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ సేవలో పాల్గొనే అవకాశం కల్పించింది. 45 నుండి 70 ఏళ్లు వయస్సుగలవారు ఈ సేవకు అర్హులు మాత్రమే. వీరు 15 రోజులు లేదా ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు.
వీరంతా శ్రీవారి సేవకుల పనిని చూసుకుంటారు. సేవకులకు హాజరు తీసుకోవడం, వారి పని తీరును చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఎవరు ఎలా పని చేస్తున్నారో గమనించి రేటింగ్ ఇవ్వనున్నారు. కనీసం పదో తరగతి చదివినవారు పరకామణి సేవకు అవకాశం కల్పించింది.
సోమవారం.. దర్శనం, రూముల బుకింగ్ వివరాలు
ఇందుకోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆ తరహా మార్పుల ద్వారా శ్రీవారి సేవ మరింత మెరుగుపడుతుందని భావిస్తోంది టీటీడీ. సోమవారం తిరుమలలో వసతి విషయానికి వద్దాం. సోమవారం అంటే మే 26న కొండపై 50, 100 రూపాయల వసతి గురించి కీలక సమాచారం ఇచ్చింది టీటీడీ. 50 రూపాయల రూములకు సంబంధించి 250 కాటేజీలు ఖాళీగా ఉన్నాయి.
అలాగే వంద రూపాయలకు సంబంధించి 1400 పైగా ఉన్నాయి. ఈ లెక్కన తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుతుందని చెప్పవచ్చు. 1000, 1518 రూపాయల వసతులకు సంబంధించి ఖాళీలు లేవని తెలిపింది. ఈ వివరాలు సోమవారం ఉదయం 7 గంటలకు ఉన్నవి మాత్రమే. భక్తులు దయచేసి గుర్తు ఉంచుకోవాలి. సర్వ దర్శనం టోకెన్ల కోసం ఒక్క సోమవారం దాదాపు 1200 టికెట్లు విడుదల చేయనుంది. శ్రీవారి మెట్టు వద్ద సోమవారం రాత్రి 8, 9 గంటల మధ్యలో ఆయా టికెట్లను ఇవ్వనుంది.