BigTV English

Mansoor Ali Khan : మెగాస్టార్ పై కామెంట్స్.. దుమారం రేపుతున్న మన్సూర్ వ్యాఖ్యలు.

Mansoor Ali Khan : మెగాస్టార్ పై కామెంట్స్.. దుమారం రేపుతున్న మన్సూర్ వ్యాఖ్యలు.
Mansoor Ali Khan

Mansoor Ali Khan : మన్సూర్ అలీ ఖాన్.. వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ పేరు.. కొన్ని రోజులు బాగా ట్రెండింగ్ గా ఉండింది. హీరోయిన్ త్రిష పై చేసిన అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో అతనెవరో తెలియని వాళ్లకు కూడా అతని గురించి తెలిసింది. నోటికి వచ్చినట్టు మాట్లాడడం.. ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం ..నాకేమీ తెలియదని బుకాయించాలని చూడడం.. లాస్ట్ కి ఏమీ చేయలేక సారీ చెప్పడం. ఇలా మన్సూర్ ఒక హైడ్రామాన్ని నడిపాడు. అంతేకాదు త్రిషకు సపోర్ట్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూల పై కేసు పెడతాను అని అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.


ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. మళ్లీ తాజాగా మన్సూర్ మెగాస్టార్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. నవంబర్ 11న త్రిష నటించిన న్యూ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన మన్సూర్ అందులో త్రిషతో రేప్ సీన్ చేయలేక పోయినందుకు బాధపడుతున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. త్రిష ఈ మాటలను తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇటువంటి వ్యక్తితో జీవితంలో ఒకే స్క్రీన్ షేర్ చేసుకోను అని తన ఆవేదనను వ్యక్తం చేసింది. త్రిష కు సపోర్ట్ గా యావత్ సినీ ప్రపంచం నిలబడింది.

చిరంజీవి, ఖుష్బూ, నితిన్, మాళవికా మోహనన్.. ఇలా ఎందరో మన్సూర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఫైనల్ గా తన తప్పు తెలుసుకున్న మనసు త్రిషకు క్షమాపణ కూడా చెప్పాడు. అతని క్షమాపణలకు స్పందించిన త్రిష సారీ యాక్సెప్ట్ చేయడంతో గొడవ ముగిసింది అని అందరూ భావించారు. గొడవ సద్దుమణిగి రెండు రోజుల కూడా కాకముందే తిరిగి మన్సూర్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు మరొక గొడవకు తెర లేపాయి.


పది రోజులపాటు ప్రజాశాంతికి భంగం కలిగించడంతో పాటు అల్లర్లు సృష్టించడానికి ప్లాన్ చేశారు అని చిరంజీవి, ఖుష్బూల పై కేసు పెడతానని మన్సూర్ వెల్లడించాడు. కావాలనే తాను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి అనవసరంగా పెద్ద గొడవకు దారితీసారని మన్సూర్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఏడాదికి ఒకసారి ఓల్డ్ హీరోయిన్స్ తో పార్టీ చేసుకోవడంలో మెగాస్టార్ బిజీగా ఉంటాడు అని అతను మండిపడ్డాడు. పార్టీలు చేసుకోవడానికి సమయం ఉండే మెగాస్టార్ తనకు మాత్రం ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అని మాట వరసకి కూడా అడగలేదు.. అన్న మన్సూర్ వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త కాంట్రవర్సీ కి శ్రీకారం చుట్టేలా ఉన్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×