Marco Scenes : 2025 ఏడాది మొదట్లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా పేరు దక్కించుకున్న చిత్రం మార్కో(Marco). మలయాళం లో విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు మోస్ట్ వైలెన్స్ మూవీగా కూడా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసి, కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా మలయాళంలో మోస్ట్ వైలెంట్ మూవీగా విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి తోడు ఇప్పటివరకు మలయాళంలో ఇలాంటి సినిమా రాలేదు. దీంతో ఈ విషయం ఒక రకంగా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. ఇకపోతే జనవరి 1న విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
షరీఫ్ మహమ్మద్ (Sharif Mohammed) నిర్మాణంలో హనీష్ అదేని (Hanish adeni) డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. జగదీష్, యుక్తి తరేజ, కబీర్ సింగ్, సిద్ధిక్, ఇషాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా తెలుగు, మలయాళం మాత్రమే కాదు అటు హిందీలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకి పోటీగా వచ్చిన కీర్తి సురేష్ (Keerthy Suresh), వరుణ్ ధావన్ (Varun Dhawan) ల ‘బేబీ జాన్’ సినిమా కూడా బోల్తా కొట్టింది అంటే అక్కడి ఆడియన్స్ ఈ సినిమాను ఏ రేంజ్ లో ఆదరించారో అర్థమవుతుంది.
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మార్కో..
ఇక ఈ సినిమా చూసిన వారంతా కూడా ఉన్ని ముకుందన్ ఇందులో చాలా అద్భుతంగా నటించారు అని ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు ఇలాంటి పర్ఫామెన్స్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈనెల 18వ తేదీ నుంచి ఓవర్సీస్ లో స్ట్రీమింగ్ కి రానుండగా.. ఫిబ్రవరి 21 నుండి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఇకపోతే ఇప్పటికే తెలుగు మినహా మిగతా భాషలలో సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మనుషులను చంపే భయంకర సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి. మరి అలాంటి సన్నివేశాల కోసం ఎదురు చూసేవారు ఈ సినిమాను ధైర్యంగా చూడాలని కూడా ఆహా నిర్వహకులు కామెంట్ చేశారు.
వైరల్ గా మారిన డిలీటెడ్ సీన్..
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి డిలీట్ చేసిన ఒక సన్నివేశాన్ని తాజాగా విడుదల చేయగా.. ఇది చూసిన ఆడియన్స్ ఇంత వయలెన్స్ ఏంటి గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఆ డిలీటెడ్ సీన్ లో ఏముందనే విషయానికి వస్తే.. హీరోయిన్ ని కొంతమంది ఆకతాయిలు ఏడిపించి ఉంటారు. వారిని జైల్లో పెట్టింటారు కూడా.. కానీ పోలీస్ మాత్రం ఆ ఆకతాయిలకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న హీరో.. హీరోయిన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి.. అటు పోలీసులతోపాటు ఆకతాయిలను కూడా రక్తం వచ్చేలా కొట్టి వారిని చిత్రవధకు గురిచేస్తాడు. ఇక ఈ సన్నివేశం అక్కడ చాలా భయంకరంగా అనిపిస్తుంది .ఇది చూసిన వాళ్లంతా కూడా ఇంత వైలెన్స్ ఏంటి గురువు అంటూ ముకుందన్ పై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే డిలీట్ అయిన సీన్ ను ఇప్పుడు విడుదల చేయడంతో ఇది కూడా యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Marco Deleted Scene #UnniMukundan #ShareefMuhammed #HaneefAdeni #RiyazKhan #MarcoMovie #BIGTVCinema pic.twitter.com/BBbRJZI3eI
— BIG TV Cinema (@BigtvCinema) February 17, 2025