Hari Hara Veera Mallu Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా సినిమాలు డిజాస్టర్ అయిన కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగింది తప్ప ఏ మాత్రం తగ్గలేదు. పదేళ్లు హిట్టు లేకపోయినా కూడా మార్కెట్ దెబ్బతినలేదు. అయితే పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ కెరియర్లో వరుసుగా బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలు పడ్డాయి. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల లో కూడా పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు మామూలుగా ఉంటున్నాయి కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించేవి.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్ట్రైట్ సినిమాలు కంటే కూడా తన కెరియర్ లో రీమేక్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీయంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా ఆ సినిమా తెరకెక్కింది. ఇక మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనమ్ కోషియం సినిమాకి రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కింది. ఇక సముద్ర ఖని దర్శకత్వం వహించిన వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కింది. ఇప్పటివరకు రీయంట్రి తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన అన్ని సినిమాలు కూడా రీమేక్ సినిమాలు.అంతేకాకుండా హరిష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో చాలామంది ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు అనే మరో సినిమా కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. క్రిష్ తో పాటు నిర్మాత ఏం రత్నం తనయుడు జయ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా మంచి అంచనాలను పెంచింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ టైం కి సినిమా వస్తుందని గ్యారెంటీ లేదు.
హరిహర వీరమల్లు మార్చి 28న విడుదల చేయాలి. అంటే దాదాపు 40 రోజుల మాత్రమే టైముంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్టాఫ్ రీ రికార్డింగ్ తో సహా సమస్తం రెడీ. అయితే ఈ సినిమాలో ఓ కీ సీన్ తీయాల్సివుంది. అందుకోసం పవన్ డేట్లు కావాలి. కానీ ఇప్పట్లో పవన్ షూటింగ్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అలానే ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. అప్పుడు పవన్ ఇంకా బిజీ అయిపోతారు.
మార్చి రెండోవారంలో డేట్లు ఇచ్చినా అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేస్తారా? అనేది పెద్ద అనుమానం. ఈ పరిస్థితులు దృష్ట్యా హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడటం ఖాయం అనిపిస్తుంది.
Also Read : Ram Charan : బ్రహ్మానందం సినిమాపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రియాక్షన్