Mastan Sai Case: మహిళల న్యూడ్ వీడియోల విషయంలో జైలుశిక్ష అనుభవిస్తున్న మస్తాన్ సాయి కేసు రోజురోజుకీ మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేయడంతో మస్తాన్ సాయి ఆగడాలు బయటికొచ్చాయి. అలా మెల్లగా తన డ్రగ్స్ వ్యవహారం కూడా బయటపడింది. ఎలా చూసినా కూడా మస్తాన్ సాయి తప్పే ఉందంటూ ఆదారాలు అన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయి. తాజాగా మస్తాన్ సాయికు మాత్రమే కాదు.. తన కుటుంబంపై కూడా ఈ కేసు ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే వారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ లావణ్య తరపున న్యాయవాది గవర్నర్‌కు నేరుగా ఒక పిటీషన్ అందజేశారు. దీంతో మస్తాన్ సాయి కుటుంబానికి కూడా తిప్పలు తప్పవని అర్థమవుతోంది.
అందరికీ లేఖలు
గత కొన్నాళ్లుగా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులు గుంటురూలోని మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మస్తాన్ సాయి పలు క్రిమినల్ కేసుల వల్ల జైలు శిక్ష అనుభవిస్తుండగా ధర్మకర్తల్లాంటి ఉన్నత స్థాయిలో వారి కుటుంబం ఉండడం కరెక్ట్ కాదంటూ ఏకంగా గవర్నర్‌కే లేఖ పంపింది లావణ్య. అక్కడి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య తరపున న్యాయవాది దానికి సంబంధించిన లేఖ పంపించారు. మస్తాన్ సాయి నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని ఆ లేఖలో రాశారు. గవర్నర్ మాత్రమే కాదు.. సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా ఈ విషయంపై లేఖలు రాశారు.
దొంగతనంగా ఇంటికొచ్చింది
ఈ కేసు విషయంలో తమ పేర్లను కూడా మధ్యలోకి లాగడంతో మస్తాన్ సాయి తల్లిదండ్రులు సైతం లావణ్యపై రివర్స్ అయ్యారు. లావణ్య (Lavanya)పై కూడా పలు ఆరోపణలు చేశారు. ఇదంతా లావణ్య కావాలనే చేస్తోందని, చాలాకాలంగా తమతో పాటు తమ కుమారుడిని కూడా బ్లాక్‌మెయిల్ చేస్తుందని చెప్పుకొచ్చారు. అసలు తన చేతికి హార్డ్ డిస్క్ ఎలా వెళ్లిందని విషయం కూడా వారు వివరించారు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన ఇంట్లో ఉండే హార్డ్ డిస్క్‌ను తీసుకెళ్లిపోయిందని మస్తాన్ సాయి తండ్రి అన్నారు. ఆయన చెప్పిందంతా నిజమే అని నిరూపించడం కోసం వారి ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా బయటపెట్టారు.
Also Read: లావణ్య గుట్టు రట్టు చేసిన మస్తాన్ సాయి పేరెంట్స్.. వీడియోలతో సహా…
ఆధారాలు ఉన్నాయి
మస్తాన్ సాయి (Mastan Sai) తల్లిదండ్రులు సైతం ఈ కేసులో తమ కొడుకు తప్పేమీ లేదని, కచ్చితంగా పోలీసులు తమకు అండగా ఉంటారని నమ్మకం వ్యక్తం చేశారు. లావణ్యనే డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తుందని, తన వల్ల ఇదంతా అయ్యిందని ఆరోపించారు. మొదట్లో అందరు కలిసి రూ.8 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేసిందని, ఇప్పుడు మళ్లీ రూ.50 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తుందని అన్నారు. అలా మస్తాన్ సాయి తల్లిదండ్రులు సైతం లావణ్యపైనే ఆరోపణలు చేస్తూ ఆధారాలు చూపించడంతో ఇప్పుడు మస్తాన్ సాయి వైపు కూడా కేసు బలంగా మారుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అలా మస్తాన్ సాయి, లావణ్య కేసు రోజురోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది.