Naga Chaitanya – Shobhita:చాలామంది నటీనటులు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రిటీలు ఎన్నో సహాయాలు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా నాగచైతన్య (Naga Chaitanya ) వంతు వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ (Shobhita dhulipala) తో కలిసి క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లల కోసం సాయం చేసి వార్తల్లో నిలిచారు. మరి ఇంతకీ నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల జంట కూడా చేరిపోయింది. ఒకప్పుడు నాగ చైతన్య సమంత (Samantha)ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పుకునేవారు. కానీ వారి విడాకుల తర్వాత చాలామంది బాధపడ్డారు. ఇక శోభితని పెళ్లి చేసుకున్నాక.. చైతూ – శోభితను చాలామంది ట్రోల్ చేశారు.
క్యాన్సర్ పిల్లలతో ఆడి పాడిన నాగచైతన్య – శోభిత జంట..
కానీ వాళ్ళు మాత్రం ట్రోల్స్ ని పక్కన పెడుతూ.. తమ వివాహ బంధాన్ని గౌరవిస్తూ.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా నాగచైతన్య నటించిన తండేల్(Thandel) మూవీ హిట్ కొట్టడంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగిపోయింది. అయితే తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల కలసి క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లలతో కలిసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి, వారితో కలిసి డ్యాన్సులు వేసి,కబుర్లు చెప్పుకొని, సెల్ఫీలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఇద్దరు కలిసి తాజాగా హైదరాబాదులో ఉండే సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ ని సందర్శించారు.ఇక ఈ సెంటర్లో క్యాన్సర్ తో పోరాడుతున్న చాలామంది పిల్లలకు ఉచితంగా ఆశ్రయం ఇస్తూ ఉంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అక్కడికి వచ్చిన పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ఈ సెంటర్ ఉచితంగా ఆశ్రయం కల్పిస్తూ ఉంటుంది.
బిజీ షెడ్యూల్లో కూడా..
అయితే తాజాగా ఈ సెంటర్ ని సందర్శించిన నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల అక్కడున్న పిల్లలందరినీ ప్రేమగా పలకరించి, వారితో ఆడి పాడి కబుర్లు చెప్పి అడిగిన వాళ్లందరికీ సెల్ఫీలు ఇచ్చి చివర్లో వారికి నచ్చిన బహుమతులు కూడా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఇక ఏదైనా వ్యాధితో బాధపడే వారికి ఇలా ప్రేమతో చూసుకుంటే వారి వ్యాధి సగం నయమవుతుంది. ఇక నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను చూడడంతో ఆ పిల్లల మొహాలు ఆనందాలతో వెలిగిపోయాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ చూసినా అక్కినేని అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా నాగచైతన్య శోభిత దూళిపాళ్లల మంచి మనసును మెచ్చుకుంటున్నారు. మీ బిజీ లైఫ్ లో కొద్ది సమయం ఆ పిల్లలకు కేటాయించి వారితో సరదాగా గడిపి మంచి మనసు చాటుకున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.