Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. అందరి ఫ్యామిలీస్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత మరోసారి మెగా చీఫ్ కోసం పోటీ జరిగింది. ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం ప్రేరణనే మెగా చీఫ్‌గా ఉంది. కానీ తను చీఫ్ అయినప్పటి నుండి హౌస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఆఖరికి తిండి తినాలన్నా కూడా ప్రేరణ ఏమంటుందో అనే ఫీలింగ్ అందరు కంటెస్టెంట్స్‌కు వచ్చేసింది. ఎవరి సపోర్ట్ వల్ల అయితే తను మెగా చీఫ్ అయ్యిందో వారినే వెన్నుపోటు పొడిచింది. ఫైనల్‌గా ఈవారం మెగా చీఫ్ పోటీ జరిగి మరోసారి అవినాష్ ఆ పదవిని దక్కించుకున్నాడు. ఆటలో రోహిణి రెండో స్థానం దక్కించుకొని జస్ట్‌లో మెగా చీఫ్ పొజిషన్‌ను పోగొట్టుకుంది.
అందరితో గొడవే
గతవారం పృథ్వి, విష్ణుప్రియా, నిఖిల్, యష్మీ సపోర్ట్‌తో మెగా చీఫ్ అయ్యింది ప్రేరణ. అయితే చీఫ్ అనే స్థానం ఉందని తెలిసినప్పటి నుండి ప్రతీవారం తనకు ఆ పొజిషన్ దక్కితే బాగుంటుందని ప్రేరణ ఆశపడింది. అందుకే తన ఫ్రెండ్స్ అంతా కలిసి తనకు సపోర్ట్ చేస్తే ఆ తరువాతి రోజే వారికి ఎవిక్షన్ షీల్డ్ దక్కకుండా చేసింది ప్రేరణ. సీతాఫలం తిన్నందుకు గౌతమ్‌ను సిగ్గులేదా అని తిట్టింది. అందరూ కలిసి సరదాగా ఒక కామెడి స్కిట్ చేస్తున్నప్పుడు కూడా ఇంటిని నీట్‌గా పెట్టలేదని అవినాష్‌కు వేస్ట్ ఫెలో అని తిట్టింది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో టేస్టీ తేజ ఒక్క ఎక్స్‌ట్రా దోశ తిన్నాడని అందరితో చెప్పుకుంది. దీంతో మెగా చీఫ్‌గా అసలు ప్రేరణ పద్ధతి ఎవ్వరికీ నచ్చలేదు.
Also Read: బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..?
కిచెన్‌లో ఉండొద్దు
తన మాటల ద్వారా, యాక్షన్స్ ద్వారా ప్రేరణ అందరినీ హర్ట్ చేస్తున్నా కూడా తనవరకు తాను మెగా చీఫ్‌గా కరెక్ట్‌గానే ఉన్నట్టు ఫీలయ్యింది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో ఎవరూ లేనప్పుడు తనతో తాను మాట్లాడుకుంది ప్రేరణ. ఒకవేళ మళ్లీ తనే మెగా చీఫ్ అయితే ఓకే కానీ లేకపోతే మాత్రం తను కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో అస్సలు ఉండనని చెప్పేసింది. తనలాగా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్లకి కిచెన్ డిపార్ట్‌మెంట్ సెట్ అవ్వదని ఫీలయ్యింది. మొత్తానికి మెగా చీఫ్ పోటీ మొదలయ్యింది. గతవారం ఎవిక్షన్ షీల్డ్ టాస్క్‌లో తేజ చేసిన తప్పు వల్ల తను మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. అందుకే ఈ టాస్క్‌కు తనే సంచాలకుడు అయ్యాడు.
నచ్చింది తినండి
ఈ టాస్క్‌లో ముందుగా తాడుకు ఉన్న ముడి విప్పి అందులో ఉన్న చీఫ్ అనే పదాన్ని ముందుగా ఎవరైతే రాడ్స్‌కు అతికిస్తారో వాళ్లే మెగా చీఫ్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించారు. ముందుగా అవినాష్ ఈ టాస్క్‌ను పూర్తిచేశాడు. ఆ వెంటనే రోహిణి పూర్తిచేసింది. అయినా ముందుగా కరెక్ట్‌గా ఆడి గెలవడంతో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. గతవారం అవినాష్ దగ్గర నుండి మెగా చీఫ్ స్థానాన్ని సంపాదించుకుంది ప్రేరణ. ఈవారం మళ్లీ తనకే తిరిగి ఇచ్చింది. అవినాష్ మెగా చీఫ్ అవ్వగానే వెంటనే కంటెస్టెంట్స్‌కు ఏం ఫుడ్ కావాలో తీసుకోమని, తను ప్రేరణలాగా కాదని పదేపదే చెప్పాడు. అయినా ఇప్పటికీ ప్రేరణ మాత్రం తానే మెగా చీఫ్‌లాగా బాగా చేశాననే ఫీలింగ్‌లో ఉంది.