BigTV English

OTT Movie : అనుమానంతో భార్యను కొట్టి చంపే భర్త… చివరికి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చే భార్య

OTT Movie : అనుమానంతో భార్యను కొట్టి చంపే భర్త… చివరికి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చే భార్య

OTT Movie : భార్యాభర్తల కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కొన్ని సినిమాలు వస్తే, సస్పెన్స్ థ్రిల్లర్ గా మరి కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాలను స్క్రీన్ మీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మలయాళం దర్శకులు. ఓటిటిలో ఒక మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “లవ్” (Love). ఈ మూవీలో భార్య భర్తలు పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఒకరి మీద ఒకరు అనుమానంతో గొడవలు పడుతూ ఉంటారు. వాళ్ళ జీవితాలను ఎలా నాశనం చేసుకున్నారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఈ స్టోరీలు మామూలుగా జరిగేవే అయినా దర్శకుడు డిఫరెంట్ గా తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

అనుబ్, దీప్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరూ హ్యాపీగా ఉంటున్న సమయంలోనే ఒకరి మీద ఒకరు అనుమానం పెంచుకుంటారు. అనూబ్ వేరొక అమ్మాయితో క్లోజ్ గా ఉండటంతో భార్యకు భర్త మీద అనుమానం వస్తుంది. భర్త కూడా భార్య మీద అనుమానం పడుతుంటాడు. ఒకరోజు వీళ్లిద్దరి మధ్య గొడవ తారా స్థాయికి వెళ్ళటంతో, భార్యను అనుబ్ గట్టిగా కొడతాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. అనుబ్ తను కూడా ఆత్మ హత్య చేసుకోవాలనుకుంటాడు. ఈలోగా అతని ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. వాళ్లకు తెలియకుండా భార్య శవాన్ని ఒక గదిలో ఉంచుతాడు. అనుబ్ ఫ్రెండ్ కూడా ఇదే సమస్యతో బాధపడుతూ ఉంటాడు. అక్కడే మందు తాగి అనుబ్ తో తన బాధను పంచుకుంటాడు. నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాను అని అతనితో చెప్తాడు. అలా ఎందుకు చేస్తావ్ నిన్ను మోసం చేసిన వాళ్ల మీద రివైంజ్ తీర్చుకో అని అనుబ్ తన ఫ్రెండ్ కి చెప్తాడు.

ఇంతలో అక్కడికి ఒక పోలీస్ వ్యాన్ వస్తుంది. అది చూసి అనుబ్ చాలా భయపడతాడు. ఈ క్రమంలో డోర్ బెల్ మోగుతుంది. డోర్ తెరిచి చూస్తే అనుబ్ కి ఊహించని షాక్ తగులుతుంది. ఎందుకంటే ఎదురుగా తన భార్య ఉంటుంది. ఆమె అనుబ్ తో మాట్లాడుతూ ఉంటుంది. షాక్ లో ఉన్నఅనుబ్ చనిపోయిన తన భార్య ఎలా బ్రతికిందని ఆలోచిస్తాడు. ఈ క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అనుబ్ భార్య చనిపోయిందా? అనుబ్ ఇంటికి పోలీసులు వస్తారా? వీళ్లు పడుతున్న అనుమానాలు నిజమైనవేనా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘నెట్ ఫ్లిక్స్’ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వకండి. క్లైమాక్స్ చూసిన తర్వాత మీ దిమ్మ తిరగడం ఖాయం.

Related News

Madharaasi OTT: మదరాసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే?

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

Big Stories

×