Lalithaa Kiran Kumar : లలిత జ్యువెలరీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. బంగారం కొనుక్కునే ప్రతి మధ్యతరగతి కుటుంబానికి లలిత జ్యువెలరీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇక లలిత జ్యువెలరీ M.d కిరణ్ కుమార్ అంటే అంతమందికి తెలియకపోవచ్చు. డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ చెప్తే మాత్రం ఆయన ఫేస్ టక్కున గుర్తొస్తుంది. కొంతమంది ఆయనను గుండు అంకుల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇదే విషయాన్ని ఆయనకు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన కూడా పెద్దగా ఫీల్ కాలేదు. రీసెంట్ గా కిరణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ కు తన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో అద్భుతమైన విషయాలను పంచుకున్నారు. అయితే ఆయన ఎంత క్యాజువల్ గా ఉంటారు అనేది ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది.
34 కోట్లు పోయింది
కిరణ్ కుమార్ కు దాదాపుగా 60కు పైగా లలిత జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. వాటిలో కేరళలో ఉండే ఒక షాప్ లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనం జరిగిన వెంటనే ఆ షాపుకు సంబంధించిన కీలక వ్యక్తి రాజేష్ కిరణ్ కుమార్ కి ఫోన్ చేశారు. కిరణ్ కుమార్ కి ఫోన్ రాగానే చాలా కూల్ గా ఏ ఫ్లోర్ లో జరిగింది అని అడిగారు. అతను ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పగానే ఈయనకి ఉన్న క్లారిటీ వలన 34 కోట్లు అని ఒక ఐడియా వచ్చింది. అదే సెకండ్ ఫ్లోర్ లో జరుగుంటే 60 కోట్లకు పైగా నష్టపోయేవాడిని అని రియలైజేషన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే చాలామంది పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా కేరళ సీఎం తో కూడా కూర్చొని ఈ విషయాన్ని తెలియజేశారు కిరణ్ కుమార్.
?utm_source=ig_web_copy_link
48 గంటల్లో దొరికాడు
కిరణ్ కుమార్ అలర్ట్ అయిన వెంటనే పోలీసులను,సీఎం ను కలిసిన తర్వాత ఆ దొంగ మాత్రం ఊహించని రీతిలో దొరికాడు. 34 కోట్ల విలువ గల బంగారాన్ని దొంగిలించిన వ్యక్తి ఒక ట్రాఫిక్ పోలీస్ కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో దొరికిపోయాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇది పచ్చి నిజం. అయితే ఈ దొంగతనం జరగడం వల్ల కూడా మేము చాలా నేర్చుకున్నాం అంటూ కిరణ్ కుమార్ ఇంటర్వ్యూలో తెలిపాడు. సెన్సార్ తో సంబంధించిన గోడలను నిర్మించడం కూడా మొదలుపెట్టారు. దొంగతనం తర్వాత చాలా పగడ్బందీగా ఆ షోరూంను చేసాము అంటూ కిరణ్ కుమార్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అంతేకాకుండా తాను ఎంత సరదాగా ఉంటానో అనే విషయాలను కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Also Read : V.n Adithya: ఆ టాప్ డైరెక్టర్స్ అంతా కూడా ఒకప్పుడు విఎన్ ఆదిత్య దగ్గర పనిచేసిన వాళ్ళే