Nurse Retires @ 28| అదృష్ట దేవత వరించడమంటే ఇదేనేమో. ఓ 28 ఏళ్ల యువకుడు ఓ కంపెనీ స్థాపించి తక్కువ సమయంలోనే వంద కోట్లకు పైగా సంపాదించాడు. అయితే ఆ తరువాత ఆ కంపెనీని విక్రయించేసి రిటైర్మెంట్ తీసకున్నాడు. తన కుటుంబంతో సమయం గడపడానికి, భార్య, పిల్లలను చూసుకోవడానికే తన సమయం కేటాయించడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
సాధారణంగా చాలా మందికి తమ కెరీర్ ఉచ్ఛ స్థితి 28 లేదా 30 ఏళ్ల తరువాతే ప్రారంభమవుతుంది. కానీ ఓ యువకుడు 28 ఏళ్లకే వంద కోట్లు సంపాదించేసి అప్పుడే రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ వయసులో అందరూ ఎంత సంపాదించినా ఇంకా తమ జీవితం ఉన్నత విజయాలు సాధించాలని ప్రయత్నిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం ఇక తన జీవితం కుటుంబం కోసం అంకితం చేయడానికి నిర్ణయించకున్నాడు. అతని పేరు నాథానెల్ ఫరేల్లీ. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందినవాడు.
నథానెల్ కు 21 ఏళ్ల వయసులో నర్సు కోర్సు పూర్తి చేసి మంచి ఆస్పత్రిలో ఉద్యోగం చేసేవాడు. అయినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతనిలో అసంతృప్తి ఉండేది. అయితే 5 ఏళ్ల క్రితం అతని అదృష్టం కలిసి వచ్చింది. ప్రపంచమంతా కరోనా మహమారి కారణంగా అల్లాడిపోతుంటే ఆ సమయంలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. ఆస్పత్రులన్నీ ఫుల్ కావడంతో చాలా మందికి ఆస్పత్రుల్లో చికిత్స లభించేది కాదు. ఆ సమయంలో నథానెల్ ఇళ్లకు వెళ్లి తీవ్ర అనారోగ్యం ఉన్న రోగులకు ఇంట్రావీనస్ థెరపీ ట్రీట్ మెంట్ అందించేవాడు. అంటే నరాల్లో ఫ్లూయిడ్ ఇంజెక్షన్స్ చేయడం. దీని ద్వారా నథానెల్ కు మంచి సంపాదన వచ్చేది. రోగులు కూడా ఆస్పత్రి ఖర్చు కంటే తక్కువ ఖర్చు కావడంతో నర్సు లను ఇంటికి పిలిపించి వైద్యం తీసుకునేవారు. అలా నథానెల్ చేతికి చేయలేనంత పని లభించింది. నథానెల్ బాగా బిజీ అయిపోయాడు. రోగులకు చికిత్స అందించేందుకు అతని సమయం ఉండేది కాదు. అయినా వారికి నిరాకరించేందుకు అతడికి మనసు ఒప్పలేదు.
Also Read: 42 ఏళ్లుగా గల్ఫ్ దేశంలో చిక్కుకున్న కొడుకు.. 90 ఏళ్ల తల్లి నిరీక్షణ ఫలించేనా?
అప్పుడే నథానెల్ కు ఒక ఆలోచన వచ్చింది. తనలాగా పనిచేసే నర్సులని సంప్రదించి వారిని తాను వెళ్లలేని చోటికి పంపించేవాడు. వారికి వచ్చే ఆదాయంలో తాను కొంత కమీషన్ తీసుకునేవాడు. ఆ తరువాత ఇదే బిజినెస్ చేస్తే బాగుంటుందని నథానెల్ భావించాడు. అందుకే ఆస్పత్రిలో ఉద్యోగం మానేసి తన నర్సు రెజిస్ట్రేషన్ ఆధారంగా ‘రివైటలైజ్’ అనే పేరుతో ఒక ఇన్ ఫ్యూజన్ థెరపీ కంపెనీ స్థాపించాడు. ఆ కంపెనీలో నర్సులకు ఉద్యోగం ఇచ్చి.. డాక్టర్లు సూచనల మేరకు ఇంటి వద్దనే వైద్యం అందించేవాడు. దీంతో ఆ కంపెనీ బిజినెస్ బాగా రన్ అయ్యేది. కంపెనీ విలువ నెలల విలువ వ్యవధిలోనే రూ.100 కోట్లక చేరుకుంది. 2023లో అమెరికాకు చెందిన ఒక బడా వ్యాపారవేత్త నథానెల్ కంపెనీ గురించి తెలుసుకొని 12.5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.106 కోట్లు ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ నథానెల్ ఆ సమయంలో తన కంపెనీ విక్రయించేందుకు నిరాకరించాడు.
డబ్బే సర్వస్వం కాదు
అయితే 18 నెలల తరువాత నథానెల్ ఆలోచన మారిపోంది. అతని భార్య వల్ల అతనికి ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. ఆమె ప్రస్తుతం నాలుగో సారి గర్భవతి అయింది. ఇంట్లో ఆమె పడే ఇబ్బందులు చూడలేక.. తన పిల్లలతో సమయం గడపలేకపోతున్నానని నథానెల్ లో వెలతి ఉండేది. అందుకే అతను కుటుంబం కోసం జీవించాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా ఒక బడా ప్రైవేట్ కంపెనీ అతని రివైటలైజ్ కంపెనీ తమకు విక్రయిస్తే రూ.119 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. నథానెల్ ఆ ఆఫర్ కు ఒప్పుకున్నాడు.
తన కంపెనీ విక్రయించేసి ఆ డబ్బులతో ఇక జీవితాంతం తన భార్య, పిల్లలకు సమయం కేటాయిస్తానని చెప్పాడు. కానీ నథానెల్ పూర్తిగా రిటైర్ మెంట్ తీసుకోలేదు. అతని స్నేహితుడు ఒకడు ఒక కాఫీ కంపెనీ, ఫిట్ నెస్ యాప్ స్థాపిస్తే అందులో పెట్టుబడులు పెట్టి ఏంజిల్ ఇన్ వెస్టర్ లా పరోక్షంగా డబ్బు సంపాదిస్తున్నాడు.