BigTV English

Meena Fires on Tanuja: వారిపై మీనా ఫైర్.. మైక్ విసిరేసి.. స్టేజి వదిలేసి..!

Meena Fires on Tanuja: వారిపై మీనా ఫైర్.. మైక్ విసిరేసి.. స్టేజి వదిలేసి..!
Actress Meena
Actress Meena

Senior Actress Meena Serious on Tanuja: ఒకప్పటి స్టార్ హీరోయిన్స్.. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తూ బిజీగా మారుతున్నారు. కానీ, సీనియర్ బ్యూటీ మీనా మాత్రం బాలనటిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు నిరాటంకంగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ఆమె జీవితంలో జరిగిన ఘటన కూడా అందరికి తెల్సిందే. అనారోగ్యం కారణంగా మీనా భర్త సాగర్ మృతి చెందారు. ఆయన మృతి తర్వాత మీనా రెండో పెళ్లిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి.


హీరో ధనుష్ తో మీనా రెండో పెళ్లి జరుగుతుందని కూడా పుకార్లు వినిపించాయి. ఇక ఈ వార్తలపై మీనా కూడా స్పందించింది. అలాంటి వార్తల్లో నిజం లేదని, తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క జడ్జిగా వ్యవహరిస్తోంది మీనా.. జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ జోడికి ఆమె ఒక జడ్జిగా వ్యవహరిస్తోంది. బుల్లితెర రీల్ అండ్ రియల్ జంటలు ఈ షోలో డ్యాన్స్ లతో అదరగొడుతున్నారు.

తాజాగా ఒక జంట చేసిన అల్లరి పనికి మీనా సీరియస్ అయ్యింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే మీనా సీరియస్ అవ్వాసంతో షోలో ఉన్నవారందరూ షాక్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే.. ముద్దమందారం తో ఫేమస్ అయిన తనూజ.. తన రీల్ పార్టనర్ తో కలిసి డ్యాన్స్ చేస్తుంది. మధ్యలో ఆమె కళ్లు తిరిగి పడిపోతుంది. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఆమెను లేపి.. ఏమైంది..? ఏమైంది..? అని కంగారు పడతారు.


Also Read: Family Star: విజయ్ కన్నా ముందు ఫ్యామిలీ స్టార్ కు అనుకున్న హీరో ఎవరో తెలుసా.. ?

ఇక జడ్జిలు అయిన శ్రీదేవి, మీనా, బిన్నీ కూడా భయపడతారు. అయితే వెంటనే తనూజ.. అదంతా ఫ్రాంక్ అని చెప్పి డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది. దీంతో మీనా వారిపై ఫైర్ అవుతుంది. మధ్యలో ఫ్రాంక్ ఏంటి ..ఇది కరెక్ట్ కాదు అంటూ స్టేజి వదిలేసి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమో చూసినవారు మీనా కూడా ఫ్రాంక్ చేసి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×