Kohli – siraj: గురువారం రోజు ఉదయం 5 గంటలకు ఆస్ట్రేలియాలోని మేల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా – భారత్ జట్ల మధ్య 4వ టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి రోజు ఆటలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆట ప్రారంభమైన తరువాత భారత్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆసీస్ బ్యాటర్ లబుషేన్ ను భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ స్లెడ్జింగ్ చేశారు.
Also Read: Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?
తిట్టిన అనంతరం నవ్వుతూ వెళుతున్న సిరాజ్ ని చూసి కోహ్లీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అలా నవ్వుతూ వెళ్లొద్దని సిరాజ్ ని కోహ్లీ హెచ్చరించాడు.” వీళ్ళతో నవ్వుతూ మాట్లాడకూడదు” అది సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. తన మొదటి టెస్ట్ ఆడుతున్న 19 ఏళ్ల సామ్ కాన్ స్టాస్ ని విరాట్ కోహ్లీ భుజంతో ఢీ కొట్టాడు. దీంతో వివాదానికి తెరలేచింది. ఇక మొదటి రోజు మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ పై వేటు వేసింది ఐసిసి. కోహ్లీ మ్యాచ్ ఫీజు లోంచి 20% కోత విధిస్తూనే.. ఓ డీమెరిట్ పాయింట్ ని కూడా విధించింది.
కోహ్లీ తీరుపై పలువురు సీనియర్ క్రికెటర్లు మడిపడుతున్నారు. మాటల వరకు పరవాలేదు కానీ ఇలా వ్యవహరించడం సరికాదని గవాస్కర్ కూడా అభిప్రాయపడ్డారు. కుర్ర క్రికెటర్ ఆట కోహ్లీని కలవర పెట్టిందని అన్నారు మైకల్ వాన్. ఇలాంటి ప్రవర్తన కోహ్లీ స్థాయి ఆటగాడికి తగదని అలీసా హీలి విమర్శించారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా కోహ్లీ యాంటీ ఫ్యాన్స్ “చోక్లీ” అనే పదాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై కాన్ స్టాన్ స్పందిస్తూ.. ” నా ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఇవాళ జరిగింది ఎమోషన్ మాత్రమే. క్రికెట్ లో ఇది సాధారణం” అని చెప్పుకొచ్చాడు.
మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఓపెనర్ బ్యాట్స్మెన్ యశస్వి జైష్వాల్ పై మండిపడ్డాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్న సమయంలో జైశ్వాల్ ని కెప్టెన్ రోహిత్ శర్మ స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ లో ఉంచాడు. ఆ సమయంలో ఫీల్డింగ్ లో ఉన్న జైష్వాల్ బంతి రాకముందే పైకి ఎగరడంతో రోహిత్ శర్మ కొన్ని సూచనలు చేశారు. “జస్సు.. నువ్వేమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా..? అతను బంతిని కొట్టక ముందే జంప్ చేస్తున్నావు. బంతిని ఆడే వరకు మోకాళ్లపైనే ఉండు” అంటూ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి.
Also Read: Rohit Sharma – Yashasvi Jaiswal: ఓరేయ్ గల్లీ క్రికెట్ ఆడుతున్నావా.. జైస్వాల్ కు రోహిత్ వార్నింగ్ ?
ఇక ఈ బాక్సింగ్ డే తొలి రోజు ఆటకి రికార్డ్ స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూసేందుకు తొలిరోజు 87, 242 మంది తరలివచ్చారు. టీమిండియా – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టులో ఒకరోజు ఇంత మంది హాజరు కావడం ఇదే తొలిసారి. ఇక తొలి రోజు ఆట ముగించే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 311 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయింది.
Virat Kohli tells Siraj : Inseh Hash keh baat Nahi karna 👀#INDvAUS #AUSvsINDpic.twitter.com/oOgpdskTBL
— Akshat (@AkshatOM10) December 26, 2024