BigTV English

Bunny Vasu : జీవితంలో నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే.. బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్..!

Bunny Vasu : జీవితంలో నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే.. బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్..!

Bunny Vasu : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవల విడుదల అవుతున్న బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహించారు. ఈ ఏడాది నాగ చైతన్య తండేల్ మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. వరుస ఫ్లాప్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ పరువుని నిలబెట్టిన సినిమా ఇది. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రావడం వల్ల ఈ సినిమా పూర్తి స్థాయి పొటెన్షియల్ బయట పడలేదని, సమ్మర్, లేదా సంక్రాంతికి విడుదల చేసి ఉండుంటే కచ్చితంగా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని కూడా అందుకొని ఉండేదని అంటున్నారు. ఈ మూవీ మొత్తానికి మంచి విజయాన్నే అందుకుంది. అయితే మూవీ విషయంలో తప్పు చేశాను అంటూ నిర్మాత బన్నీవాసు అంటున్నారు. ఈ మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


తండేల్ మూవీ భారీ విజయాన్ని అందుకున్నా కూడా ఈ టీమ్ సంతోషంగా లేరు. ఈ సినిమాకి అనుకున్న దాని కంటే ఎక్కువగా కలెక్షన్స్ రావాల్సి ఉంది కానీ, ఈ సినిమాకి ఎదురైనా అతి పెద్ద సవాల్ పైరసీ. అదేంటీ ప్రతీ సినిమాకి జరుగుతున్నదే కదా, ఈ చిత్రం గురించి స్పెషల్ గా మాట్లాడుతున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఆడియో క్వాలిటీ తో సహా నెట్టింట ప్రత్యక్షమైంది. అత్యధిక శాతం మంది జనాలు థియేటర్స్ లో కంటే ఎక్కువగా, పైరసీ లోనే చూసారు. ఫలితంగా చాలా నష్టం ఏర్పడింది.. ఈ విషయం పై తాజాగా బన్నీ వాసు మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆయన ఏమన్నారంటే..

Also Read : ప్రియుడితో బ్రేకప్.. ఆ ఒక్క కారణంతోనే వదిలేసిందా..?


తాజాగా బన్నీ వాసు ఛావా ని విడుదల చేస్తున్న సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.. నిర్మాత మాట్లాడుతూ.. తండేల్ మూవీ పైరసీ జరిగినప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టడం అతి పెద్ద మిస్టేక్.. నిజానికి ఈ మూవీ పైరసీ కి గురైంది అనే విషయం చాలా మంది జనాలకు తెలియదు. ఎపుడైతే మేము ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఆ విషయం అందరికీ తెలిసిందే. దానివల్ల ఎక్కువ మంది పైరసీ వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని మరీ చూసారు. నా జీవితం లో నేను చేసిన అతి పెద్ద మిస్టేక్ అంటే ఇదే.. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. భవిష్యత్తలో మళ్ళీ అలాంటి పొరపాటు చేయబోనని చెప్పుకొచ్చాడు. ఈ పరిస్థితి చేసిన వాళ్లని పట్టుకొని తగిన శాస్తి జరిగేలా చేస్తామని ఆయన అన్నారు కానీ ఇప్పటివరకు దీని గురించి పట్టించుకోలేదని తెలుస్తుంది. మరి దీనిపై బన్నీ వాసు ఏమంటారు చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×