Sachin – Akhil Akkineni: అక్కినేని అఖిల్ (Akkineni Akhil).. ‘సిసింద్రీ’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత ‘అఖిల్’ సినిమాతో హీరోగా మారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలు చేశారు.. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. కెరియర్ లోనే కాదు అటు వ్యక్తిగతంగా కూడా ఈయన సక్సెస్ చూడలేదు అని ఎంతోమంది అనుకున్నారు. ఎందుకంటే గతంలో శ్రియా భూపాల్ (Shriya Bhupal) తో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ నిశ్చితార్థం కాస్త క్యాన్సిల్ అవ్వడంతో.. అఖిల్ జాతకం బాగాలేదని అందరూ అనుకున్నారు. కానీ ఎట్టకేలకు తాను ప్రేమించిన, ప్రముఖ కల్చరల్ ఆర్టిస్ట్ జైనాబ్ రవ్ డ్జీ (Zainab Ravdjee)తో ఏడు అడుగులు వేశారు అఖిల్. మొత్తానికి బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టేశారు. దీంతో ఇకనైనా అఖిల్ కెరియర్ మారుతుందా? బ్యాచిలర్ లైఫ్ కంటే మ్యారీడ్ లైఫ్ ఆయన వృత్తిగత జీవితాన్ని ట్రాక్లో పెడుతుందా? అప్పుడు సచిన్ ఎలా అయితే సక్సెస్ అయ్యాడో ఇప్పుడు అయ్యగారు కూడా అలాగే సక్సెస్ అవుతారా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
జైనాబ్ తో పెళ్లి.. అఖిల్ కి కలిసొచ్చేనా?
అసలు విషయంలోకి వెళ్తే.. ‘అఖిల్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా లాంచ్ అయ్యారు. కానీ మొదటి సినిమాతోనే డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఆ తర్వాత ‘హలో’ సినిమా చేశారు కానీ అది యావరేజ్ గానే నిలిచింది. ఇక ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మాత్రం అఖిల్ ను ప్లాపుల బారి నుండి బయట పడేసింది. అయితే ఈ సినిమా విజయం సాధించినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ రేంజ్ హిట్ కాదని అందరూ అనుకున్నారు. ఇక ‘ ఏజెంట్’ విషయానికొస్తే.. ఎంతో శ్రమ పడ్డారు. సిక్స్ ప్యాక్ లుక్, భారీ యాక్షన్ డ్రాప్.. అన్నీ కూడా బెడిసి కొట్టాయి . అయితే ఇదంతా పెళ్లి జరగకముందు.. జైనాబ్ తో పెళ్లి జరిగిన తర్వాత కొత్త జీవితం మొదలైంది.
అప్పుడు దాచిన.. ఇప్పుడు అఖిల్..
జీవిత భాగస్వామి రాకతో కెరియర్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని.. పాజిటివ్ కోణంలో చూస్తే ఆయన జీవితం మరింత గొప్పగా, ప్రశాంతంగా, సక్సెస్ ఫుల్ గా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు సచిన్ జీవితంలోకి అఖిల్ కెరియర్ కూడా మారిపోతుంది అంటే కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ప్రముఖ దిగ్గజ క్రికెటర్ సచిన్ (Sachin) కూడా వయసులో తనకంటే ఆరు సంవత్సరాల పెద్ద అమ్మాయి అంజలి టెండూల్కర్ (Anjali Tendulkar)ని వివాహం చేసుకున్నారు. ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఆయన వృత్తిగత కెరియర్ కూడా అమాంతం సక్సెస్ బాట పట్టింది. అనుకోని విజయాలు ఆయనను తలుపు తట్టాయి. ఇప్పుడు జైనాబ్ , అఖిల్ మధ్య వయసు కూడా ఆరు సంవత్సరాల తేడా ఉంది. కాబట్టి అఖిల్ కూడా జైనాబ్ తో వివాహం తర్వాత కచ్చితంగా సక్సెస్ అవుతారని అందరూ భావిస్తున్నారు.
అఖిల్ సినిమా..
ఒక ప్రస్తుతం ‘ లెనిన్ ‘ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే గనుక అఖిల్ కెరియర్ కచ్చితంగా సక్సెస్ బాట పడుతుందనటంలో సందేహం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నా యి. మొత్తానికైతే అఖిల్ పెళ్లి తర్వాత కొత్త జీవితం లెనిన్ మూవీ పై ఆధారపడిందని చెప్పవచ్చు.
also read:Priyamani: ఇండస్ట్రీలో ఆ చీకటి దందా నడుస్తోంది.. రహస్యాలు బయటపెట్టిన ప్రియమణి!