Venu Swamy:ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) ఎక్కువగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. వారి జాతకాలు చెబుతూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన చెప్పిన జాతకం నూటికి నూరుపాళ్ళు నిజమైందా అంటే లేదనే చెప్పాలి. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీల జాతకాలు నిజమవగా.. మరికొన్ని బెడిసి కొట్టాయి. దీంతో చాలామంది వేణు స్వామిని టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి నాగచైతన్య(Naga Chaitanya), సమంత (Samantha) వివాహమైన నాలుగేళ్లకే విడిపోతారని చెప్పగా.. ఆయన చెప్పినట్టే వారు విడాకులు తీసుకొని దూరమయ్యారు. ఆ తర్వాత సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పలువురు స్టార్ సెలబ్రిటీలపై కామెంట్లు చేశారు. కానీ ఆయన చేసిన కామెంట్లు ఏవీ కూడా నిజం కాలేదు. దీనికి తోడు రాజకీయాలపై కూడా జాతకం చెప్పిన ఈయన.. అది కాస్త బొక్క బోర్ల పడింది. దీంతో ఈయనపై చాలామంది విమర్శలు గుప్పించారు. ఒక రాజకీయ పార్టీల దెబ్బకు సైలెంట్ అయిపోయిన వేణు స్వామి మళ్లీ నాగచైతన్య – శోభిత (Shobhita) జంట గురించి కామెంట్లు చేసి పోలీస్ కేసు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
జాతకాలతో వార్తల్లో నిలిచిన వేణు స్వామి..
ఇంత జరిగిన తనకేమీ తెలీదు అన్నట్టు మళ్లీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు.అందులో భాగంగానే ఒక వారం క్రితం టాలీవుడ్ లో సమంత , ప్రభాస్ (Prabhas), విజయ్ దేవరకొండ(Vijaya Deverakonda).ముగ్గురిలో ఒకరు ఆత్మహత్యాయత్నం చేస్తారు అని, ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఆత్మహత్యాయత్నం చేసుకుంటాడని చెప్పి సంచలనం సృష్టించారు. ఇక అలా ఎప్పటికప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వారి గురించి నెగటివ్ గా చెప్పడం వల్లే అభిమానుల విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈయన బయోపిక్ ను ఆధారంగా తీసుకొని ప్రియదర్శి (Priyadarshi) హీరోగా నటిస్తున్న ‘సారంగపాణి జాతకం’ సినిమా తీసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చేతి గీతాలు తలరాతను మారుస్తాయా అనే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్ నిర్వహించగా అందులో ప్రియదర్శి మాట్లాడుతూ వేణు స్వామి పాత్ర గురించి రివీల్ చేశారు.
Prithviraj Sukumaran: స్టార్ హీరోపై పృథ్వీరాజ్ తల్లి ఎమోషనల్ కామెంట్స్..!
సారంగపాణి జాతకం సినిమాలో వేణు స్వామి పాత్ర..
.
ప్రియదర్శి మాట్లాడుతూ..” ‘ సారంగపాణి జాతకం’ సినిమాలో.. అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) వేణు స్వామి బయోపిక్ చేశారు. ఇక ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది అనేది మీరు థియేటర్లో చూస్తారు “అంటూ తెలిపారు. ఇకపోతే వేణు స్వామి పాత్రను అవసరాల శ్రీనివాస్ చేశారు అని చెబుతుండగానే అవసరాల శ్రీనివాసరావు కాస్త ముఖం తేలేసినట్టు మనం గమనించవచ్చ ఇకపోతే ఎప్పుడూ ఒకరి జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణు స్వామి ఇప్పుడు ఆయన బయోపిక్ పై పాత్ర రాబోతుండడంతో సినిమా రిలీజ్ అయ్యాక ఆ పాత్ర చూసి వేణు స్వామి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సారంగపాణి జాతకం సినిమా విషయానికి వస్తే.. హాస్య భరిత చిత్రాల స్పెషలిస్ట్ గా పేరుపొందిన శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో రూపొందిన చిత్రం సారంగపాణి జాతకం. ఈ సినిమాలో ప్రియదర్శి , రూప కొడువాయుర్ జంటగా నటించగా.. ఇప్పటివరకు “సారంగో సారంగా”, “సంచారి సంచారి” పాటలతో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఈ సినిమా. ఇక త్వరలోనే విడుదల డేట్ అనౌన్స్ చేసే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.