Mega daughter Niharika konidela told about her not released film of Rajamauli son: మెగా డాటర్ నిహారిక అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొణిదెల నిహారిక మెగా డాటర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. పెద్దగా సినిమాలు చేయకపోయినా ప్రొడక్షన్ వైపు అడుగులు వేసి మంచి సక్సెస్ లు అందుకుంటోంది. నటనలో ఉన్న అభిరుచితో అడపాదడపా షార్ట్ ఫిలింస్ చేస్తోంది. హీరోయిన్ గా చేసిన అతి కొద్ది చిత్రాలు నటపా పరంగా నిహారికకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. సందర్భం వచ్చినప్పుడల్లా తన పెద్దనాన్న చిరంజీవిని, బాబాయ్ పవన్ కళ్యాణ్ ను పొగుడుతుంటారు. వాళ్ల సూచనలు, సలహాలు తీసుకునే తాను ఇండస్ట్రీలో ఇంత స్థాయికి ఎదిగానని సగర్వంగా చెబుతుంటారు. నటిగా, యాంకర్ గా, రియాలిటీ షో ఘోస్ట్ గా,. నిర్మాతగా విభిన్న రంగాలలో రాణిస్తోంది నిహారిక. ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తూ యూనిట్ లో అందరితోనూ కలుపుగోలుగా ఉంటారామె.
కెరీర్ ఆరంభంలో ఆటంకాలు
ప్రస్తుతం మళ్లీ తన సినీ కెరీర్ పై దృష్టి పెట్టింది నిహారిక. కమిటీ కుర్రవాళ్లు మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారామె. ఈ నెల 9న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయం పంచుకుంది. కెరీర్ ఆరంభంలో రాజమౌళి కొడుకు కార్తికేయ దర్శకత్వం వహించిన ఓ షార్ట్ ఫిలింలో నటించాను.అయితే అంతా అయిపోయాక ఆ సినిమా మేకింగ్ దర్శకుడు రాజమౌళికి నచ్చలేదు. దీనితో ఆ మూవీ రాకపోవడమే మంచిది అని రాజమౌళి నిహారికతో అన్నారట. ఎందుకంటే కెరీర్ ఆరంభమైన తొలి రోజుల్లోనే బలమైన అడుగులు పడాలని రాజమౌళి సార్ అంటుంటారు. ఆయన జడ్జిమెంట్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే నేనేమీ పెద్దగా ఫీలవ్వలేదు. ఆ మూవీ రిలీజ్ కాకపోవడమే మంచిదని ఇప్పటికీ అనుకుంటుంటాను అని చెప్పుకొచ్చారు నిహారిక. అప్పుడే విశ్వక్ సేన్ హీరోగా ఓ షార్ట్ ఫిలింలో నటించేందుకు హీరోయిన్ గా నన్ను ఒప్పించారు. కానీ ఆ మూవీ కూడా ఎందుకో పూర్తి కాలేదు. కేవలం పాటల వరకే కంప్లీట్ చేశానని చెప్పుకొచ్చారు నిహారిక.