BigTV English

Pushpa 2 Trailer: అప్పుడు బన్నీ విష్ చేయలేదు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ట్వీట్ చెయ్యలేదు

Pushpa 2 Trailer: అప్పుడు బన్నీ విష్ చేయలేదు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ట్వీట్ చెయ్యలేదు

Pushpa 2 Trailer: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో మొదలైన అల్లు అర్జున్ ప్రయాణం నేడు పుష్ప వరకు అద్భుతంగా కొనసాగింది. సినిమా సినిమాకు తనలోని కొత్తదనాన్ని బయటకు తీస్తూ అద్భుతమైన సినిమాలను ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు సాగాడు. అయితే అల్లు అర్జున్ కెరియర్ లో పుష్ప సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది పుష్ప సినిమాతో. పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో టైలర్ ని కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ట్రైలర్ అయితే చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలను కూడా మరింత పెంచింది అని చెప్పాలి.


అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక మెగా హీరో కూడా ఈ ట్రైలర్ గురించి ట్విట్ చేయలేదు. దీని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో కథనాలు వినిపిస్తూ వస్తున్నాయి. అలానే రీసెంట్ టైమ్స్ లో అల్లు అర్జున్ కూడా తన స్పీచ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడటం కంప్లీట్ గా మానేశారు. అదే ఒకప్పుడు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని పదేపదే చెబుతూ ఉండేవాడు అల్లు అర్జున్. ఇక చాలామంది మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఇదంతా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసిపి అభ్యర్థికి సపోర్ట్ చేయటం దగ్గర మొదలైంది. అయితే వైసిపి ప్రభుత్వం పైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతగా విమర్శలు చేశారు అందరికీ తెలిసిన విషయమే. అలానే పవన్ కళ్యాణ్ ని కూడా ఆ ప్రభుత్వం ఎంతలా టార్గెట్ చేసి సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించిందో కూడా తెలిసిన విషయమే. అయితే అటువంటి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడమనేది మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

Also Read : Rana Daggubati: పోస్టర్స్ మీద నెంబర్స్ టైం పాస్ కి వేస్తాం


ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా పలు సందర్భాల్లో స్పందిస్తూ ట్విట్టర్ వేదిక కొన్ని ఇన్డైరెక్ట్ ట్వీట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా ఈవెంట్ భారీ రేంజ్ లో జరిగింది. అభిమానులు కూడా భారీ స్థాయిలో హాజరయ్యారు. బాలీవుడ్ హీరోలు కూడా ఊహించని రేంజ్ లో ఈవెంట్ జరిగింది. అయితే ట్రైలర్ ని అందరూ పొగుడుతున్న సమయంలో ఒక మెగా హీరో కూడా ట్వీట్ చేయకపోవడం అనేది మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. ప్రతి చిన్న సినిమాకి తన వంతుగా ట్విట్ పెట్టే సాయి తేజ్ కూడా ఈ సినిమా గురించి ఎటువంటి ట్విట్ చేయలేదు. అయితే అందరూ దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు బన్నీ కూడా మెగా ఫ్యామిలీ సినిమాలు గురించి కూడా పెద్దగా ట్విట్ చేయలేదు. అయితే ఆ విషయాన్ని ఎవరు ప్రస్తావన లోకి తీసుకురావడం లేదు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×