BigTV English

Chiranjeevi : ఆ డైరెక్టర్లను దూరం పెడుతున్న మెగాస్టార్… చిరులో ఈ కొత్త మార్పు గమనించారా ?

Chiranjeevi : ఆ డైరెక్టర్లను దూరం పెడుతున్న మెగాస్టార్… చిరులో ఈ కొత్త మార్పు గమనించారా ?

Chiranjeevi : ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాలం చెల్లిన పాత కథలు అంటే ప్రేక్షకులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. మొహమాటం లేకుండా రొటీన్ స్టోరీలతో వచ్చే సినిమాలను రిజెక్ట్ చేసి పారేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే కొత్త దర్శకుల ప్రతిభ కూడా ఈ ఏడాది టాలీవుడ్ లో ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలోనే ట్రెండ్ కు తగ్గట్టుగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.


ఇటీవల కాలంలో మెగాస్టార్ (Chiranjeevi) చిరంజీవి సీనియర్ డైరెక్టర్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత చిరు చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. సరిగ్గా గమనిస్తే చిరంజీవిలో వచ్చిన మార్పు ఇట్టే అర్థమయిపోతుంది. నిజానికి వివి వినాయక్ వంటి సీనియర్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేస్తారు అన్నారు. అలాగే పూరి జగన్నాథ్ తో కూడా ఓ మూవీ ఉంటుందని టాక్ నడిచింది. కానీ చిరు మాత్రం వీళ్ళందర్నీ దూరం పెట్టేశారు. సీనియర్ డైరెక్టర్లకు పూర్తిగా దూరంగా ఉంటూ, తాను కూడా ట్రెండ్ కు తగ్గ కథల కోసం కొత్త దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు చిరంజీవి.

ఇప్పటికే ఆయన ‘విశ్వంభర’ (Vishwambhara) మూవీతో ఈ పనిని మొదలు పెట్టేశారు. అందులో భాగంగానే ‘బింబిసార’ మూవీతో మంచి హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ వశిష్టకు ఛాన్స్ ఇచ్చారు. ఫలితంగా అత్యంత భారీ బడ్జెట్ తో ‘విశ్వంభర’ అనే పాన్ ఇండియా మూవీ సెట్స్ పైన ఉంది. ఇక నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెలతో చిరు సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చిరు సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ మూవీ పై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


ఇలా మొత్తానికి సీనియర్ డైరెక్టర్లు అందరినీ పక్కన పెట్టేసి, చిరు (Chiranjeevi) యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలను సెట్ చేస్తుండడం విశేషం. అయితే ఈ మార్పు రావడానికి కారణం ఇటీవల చిరు ఖాతాలో పడిన వరుస డిజాస్టర్లు అని చెప్పాలి. చివరగా చిరంజీవి ‘భోళా శంకర్’ అనే డిజాస్టర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘విశ్వంభర’ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అంతకంటే ముందు చిరు చేసిన ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాలతో వరుస డిజాస్టర్ లను తన ఖాతాలో వేసుకున్నారు. మధ్యలో ‘వాల్తేరు వీరయ్య’ వచ్చి హిట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ‘భోళా శంకర్’తో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ లో చిరు మార్పు వచ్చీ, యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయడం గమనార్హం. ఏదేమైనా మార్పు మంచిదే అంటున్నారు మెగా ఫ్యాన్స్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×