Megastar New Look : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. ఆయన సినీ కేరియర్ సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించుకున్నారు. అయితే హీరో అన్న తర్వాత సక్సెస్ తో పాటు ఫ్లాప్ లను కూడా చవిచూడాల్సి వస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. అలాంటి సినిమాలు చిరంజీవి ఖాతాలో కూడా కొన్ని ఉన్నాయి.. ఈ మధ్య సరైన హిట్ సినిమా పడలేదు.. ప్రస్తుతం విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఇక మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ లుక్ లో కనిపించునున్నారని టాక్. దానికి కోసం చిరు లుక్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.. తాజాగా చిరంజీవి న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ఆ ఫోటోలలో చిరు డిఫరెంట్ లుక్ తో పాటుగా స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నారు. ఆ ఫోటో లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త సినిమా కోసమా లేదా క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కోసమా అన్నది తెలియలేదు. చిరు స్టైలిష్ లుక్ ఫోటోలు మాత్రం ఓ రెంజలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న విశ్వంభరా మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో బిజీగా ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో. మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. భోళా శంకర్ ప్లాప్ తర్వాత రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాల ఉన్నాయి. మరి మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
ఇక ఈ మూవీ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఓ సినిమాకి ప్రకటన వచ్చేసింది. గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తలను నిజం చేస్తూ ఈ కాంబోలో మూవీ రాబోతున్నట్లు కన్ఫార్మ్ చేశారు. ఈ మెగా మూవీని హీరో నాని స్వయంగా సమర్పిస్తున్నారు. దీని కోసం కొత్త బ్యానర్ ను స్థాపించారు. హీరో నాని ఇదివరకే ‘వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ పెట్టి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాను ప్రెజెంటర్ గా వ్యవహరిస్తూ ప్రశాంతి త్రిపురనేని నిర్మాణంలో సినిమాలు చేస్తూ వస్తున్నారు.. భారీ బడ్జెట్ తో నిర్మిస్తారు. ఒకదానికి మరొకటి అనుబంధం అన్నట్లు టాలీవుడ్ లో చాలామంది నిర్మాతలకు రెండేసి బ్యానర్లు ఉన్నాయి. ఇప్పుడు నాని పేరు మీదుగా రెండు నిర్మాణ సంస్థలు వచ్చాయి.. ఇక మూవీలో చిరంజీవి ఎలా కనిపించబోతున్నాడో అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.