BigTV English

Megha Akash: శ్రీలంకలో చల్ మోహన రంగా అంటూ బ్యాచిలర్ పార్టీ చేసుకున్న మేఘా ఆకాష్

Megha Akash: శ్రీలంకలో చల్ మోహన రంగా అంటూ బ్యాచిలర్ పార్టీ చేసుకున్న మేఘా ఆకాష్

Megha Akash gives her bachelorette party with friends in Sri Lanka ahead of her marriage: తెలుగులో లై మూవీతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. ఆ మూవీలో నితిన్ హీరో. చల్ మోహన రంగా, రాజరాజ చోర, డియర్ మేఘా, రావణాసుర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం తదితర సినిమాలలో నటించి మెప్పించింది. మేఘా ఆకాష్ కు కుర్రకారులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. గత నెల 22న ఎంగేజ్ మెంట్ జరుపుకుంది ఈ బ్యూటీ. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమారుడైన సాయి విష్ణుతో మేఘా వివాహమాడబోతోంది. చెన్నై బ్యూటీగా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్.


చెన్నై చందమామ

చెన్నై క్రిస్టియన్ కాలేజ్ లో చదువుకుంది. తల్లి మలయాళీ. తండ్రి మాత్రం తెలుగు నేపథ్యం ఉన్నవారే కావడం విశేషం. బీఎస్సీ చదివిన ఈ చెన్నై చందమామ 2020 లో ఒరు పక్క కథై అనే తమిళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. రాజరాజ చోర మూవీలో సంజనగా డియర్ మేఘా మూవీలో మేఘగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఎప్పటినుంచో తన బాయ్ ఫ్రెండ్ సాయి విష్ణుతో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తున్న మేఘా ఆకాష్ ఆగస్టు 22వ తేదీన తన కుటుంబీకులు,సన్నిహితుల మధ్య ఎంగేజ్ మెంట్ జరుపుకుంది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలకు కమిట్ అయింది మేఘా ఆకాష్.


నటిగా ఫుల్ హ్యాపీ
నటిగా తన ప్రయాణం సంతృప్తికరంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు ఏదీ అతిగా ఆశించడం ఇష్టం ఉండదని చెబుతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత నటిస్తానంటున్నారు మేఘా. సమయం చిక్కితే చాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తానంటున్నారు. డబ్బులు వస్తున్నాయని ఏవి పడితే ఆ సినిమాలను ఒప్పుకోనని..ఒకేసారి మూడు నాలుగు సినిమాలు ఒప్పుకోవడం ద్వారా ఏ సినిమాకూ న్యాయం చేయలేనని అంటారామె. తన సినిమాలు అన్నీ ఓ సాధారణ ప్రేక్షకురాలిగానే చూస్తానంటున్నారు. అది కూడా ఒక్కసారే చూసేందుకు ఇష్టపడతారట. సినిమాలో తనకు ఎలాంటి పాత్ర లభించింది..దానికి ఎంతవరకూ న్యాయం చేశాననే ఆలోచిస్తా తప్ప తక్కిన వాటిని అస్సలు పట్టించుకోనంున్నారు. దర్శకుడు ఏం చెబితే అది చేయడమే తప్ప మిగిలిన వాటిపై అంతగా దృష్టి పెట్టనంటున్నారు.

బ్యాచిలర్ పార్టీ

గత నెలలో ఎంగేజ్ మెంట్ జరుపుకున్న మేఘా ఆకాష్ మరి కొన్ని రోజుల్లో తన ప్రియుడితో కలిసి వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే తన స్నేహితులు, అత్యంత సన్నిహితులతో కలిసి ఇటీవల శ్రీలంక కు వెళ్లారు మేఘా. అక్కడే బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు మేఘా. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ స్టా వేదికగా తన ఫొటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. దీనితో నెటిజనులు మేఘాకు పెళ్లి వేడుక శుభాకాంక్షలు ముందస్తుగానే తెలియజేస్తున్నారు. ఆమె వైవాహిక బంధం స్ఫూర్తిదాయకంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. మేఘా అందమైన మొహం లాగానే ఆమె రాబోయే జీవితం కూడా అందంగా కొనసాగాలని కోరుతున్నారు.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×