Meher Ramesh: టాలీవుడ్‌లో మరొక విషాదం చోటు చేసుకుంది. ఎంతోమంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి, వారి కెరీర్‌లో మరిచిపోలేదని హిట్స్ ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి తాజాగా కన్నుమూశారు. సత్యవతి గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. తాజాగా తన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారని, గురువారం ఆ ఆసుపత్రిలోనే ఆమె కన్నుమూశారని తెలుస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులు మెహర్ రమేష్ సోదరి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తన కుటుంబానికి ప్రగాఢ సానుబూతి తెలియజేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా దర్శకుడిగా పనిచేస్తూ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు మెహర్ రమేష్.
మహేశ్ ఫ్రెండ్‌గా
డైరెక్టర్‌గా మారక ముందు చాలాకాలం వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇతర దర్శకులతో పనిచేస్తూ ఎక్స్‌పీరియన్స్ పెంచుకున్నాడు మెహర్ రమేశ్ (Meher Ramesh). అదే క్రమంలో మహేశ్ బాబు హీరోగా నటించిన ‘బాబీ’లో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమా అంతగా హిట్ అవ్వకపోయినా మహేశ్ బాబు ఫ్రెండ్‌గా మెహర్ రమేశ్ నటించాడని ఇప్పటికీ చాలామంది మూవీ లవర్స్‌కు గుర్తుంది. అలా చాలాకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన తర్వాత తనకు కన్నడలో మొదటి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. తన మొదటి సినిమానే రీమేక్‌ను ఎంచుకొని పెద్ద సాహసమే చేశాడు మెహర్ రమేశ్. కానీ ఆ ప్రయోగం వల్లకు తనకు హిట్టే దక్కింది.
కన్నడతో ఎంట్రీ
తెలుగులో ఎన్‌టీఆర్ హీరోగా, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆంధ్రావాలా’ సినిమాను కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో ‘వీర కన్నడిగా’గా తెరకెక్కించాడు మెహర్ రమేష్. తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదలయిన ‘ఆంధ్రావాలా’ డిశాస్టర్ అయ్యింది. కానీ కన్నడలో మాత్రం మెహర్ రమేష్ తెరకెక్కించిన రీమేక్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో తనకు కన్నడలోనే రెండో సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. 2004లో ‘వీర కన్నడిగా’ విడుదలయిన తర్వాత 2006లో ‘అజయ్’ అనే మరో మూవీతో కన్నడ ప్రేక్షకులను పలకరించాడు మెహర్ రమేష్. అది కూడా మహేశ్ బాబు హీరోగా నటించిన ‘ఒక్కడు’ రీమేకే.
Also Read: నావి చెత్త సినిమాలు, అందుకే ఫ్లాప్ అయ్యాయి.. సెల్ఫ్ ట్రోల్ చేసుకున్న సల్మాన్ ఖాన్
ఆపై తెలుగులో అడుగు
కన్నడలో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న తర్వాతే తెలుగులో అడుగుపెట్టాడు మెహర్ రమేష్. ముందుగా ఎన్‌టీఆర్ హీరోగా ‘కంత్రి’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బిల్లా’ మాత్రం మెహర్ రమేష్ కెరీర్‌లోనే ల్యాండ్‌మార్క్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పటికే మెహర్ రమేష్ అంటే ‘బిల్లా’ డైరెక్టర్ అనే గుర్తుపెట్టుకుంటారు చాలామంది ప్రేక్షకులు. ఆ తర్వాత ఎన్‌టీఆర్, వెంకటేశ్ లాంటి హీరోలతో సినిమాలు చేసినా దర్శకుడిగా తనకు హిట్ పడలేదు. మళ్లీ చాలాకాలం తర్వాత చిరంజీవితో కలిసి చేసిన ‘భోళా శంకర్’ కూడా మెహర్ రమేష్‌కు ఫ్లాప్‌నే మిగిల్చింది.